MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/sohel40ae545a-3089-4bb1-958b-c40ff02ba436-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/sohel40ae545a-3089-4bb1-958b-c40ff02ba436-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ 4లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ లో సోహైల్ ఒక‌రు. సీరియ‌ల్ హీరోగా కెరీర్ ను మొద‌లు పెట్టిన సోహైల్ బిగ్ బాస్ త‌ర‌వాత వ‌చ్చిన పాపులారిటీతో సినిమా ఛాన్స్ ను కొట్టేశారు. ఇప్ప‌టికే సినిమాను అఫీషియ‌ల్ గా కూడా ప్ర‌కటించారు. అంతే కాకుండా ఇటీవ‌లే ఈ చిత్రాన్ని లాంచ‌నంగా ప్రారంభించారు. "జార్జ్ రెడ్డి", "ప్రెజర్ కుక్కర్" లాంటి సినిమాలను తెర‌కెక్కించిన మైక్ మూవీస్ బ్యాన‌ర్ పై చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అప్పిరెడ్డి, స‌జ్జ‌ల ర‌వి రెడ్డి చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చsohel;chiranjeevi;srinivas;cinema;bigboss;satyadev;lella appi reddy;heroine;george reddy;reddy;vబిగ్ బాస్ సోహెల్ కు జోడీగా సత్యదేవ్ హీరోయిన్..!బిగ్ బాస్ సోహెల్ కు జోడీగా సత్యదేవ్ హీరోయిన్..!sohel;chiranjeevi;srinivas;cinema;bigboss;satyadev;lella appi reddy;heroine;george reddy;reddy;vMon, 29 Mar 2021 21:24:01 GMTబిగ్ బాస్ 4లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ లో సోహైల్ ఒక‌రు. సీరియ‌ల్ హీరోగా కెరీర్ ను మొద‌లు పెట్టిన సోహైల్ బిగ్ బాస్ త‌ర‌వాత వ‌చ్చిన పాపులారిటీతో సినిమా ఛాన్స్ ను కొట్టేశారు. ఇప్ప‌టికే సినిమాను అఫీషియ‌ల్ గా కూడా ప్ర‌కటించారు. అంతే కాకుండా ఇటీవ‌లే ఈ చిత్రాన్ని లాంచ‌నంగా ప్రారంభించారు. "జార్జ్ రెడ్డి", "ప్రెజర్ కుక్కర్" లాంటి సినిమాలను తెర‌కెక్కించిన మైక్ మూవీస్ బ్యాన‌ర్ పై చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అప్పిరెడ్డి, స‌జ్జ‌ల ర‌వి రెడ్డి  చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజ‌నంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఓ వినూత్న క‌థ‌తో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. సొసైటీలో జ‌రుగుతున్న ఓ బ‌ర్నింగ్ ఇష్యూ మీద ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని టాక్. సినిమా ప్రారంభ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన సోహైల్ ఈ సినిమా ప్ర‌తి మ‌హిళ గ‌ర్వ‌ప‌డేలా ఉంటుంద‌ని అన్నారు. అంతే కాకుండా భారత దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ రాని ఒక కొత్త పాయింట్ తో ఈ సినిమా ను తెర‌కెక్కించ‌బోతున్నట్టు వెల్ల‌డించారు.

ఇక ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇక హోళీ పండ‌గ సంద‌ర్భంగా తాజాగా ఈ సినిమా గురించి ఆస‌క్తికర అప్డేట్ ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సినిమాలో సోహైల్ స‌ర‌స‌న హీరోయిన్ గా రూప కొడువ‌యూర్ న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రూప లాక్ డౌన్ వేల ఓటీటీలో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో స‌త్య‌దేవ్ కు హీరోయిన్ గా న‌టించిన రూప త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇక ఇప్పుడు సోహైల్ ప‌క్క‌న న‌టించ‌నుంది. ఇక ఈ సినిమాపై సోహెల్ ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. ఒక్క మంచి సినిమా చేసినా చాల‌ని సోహెల్ బిగ్ బాస్ ఫినాలే కార్య‌క్ర‌మంలో అన్నారు. అనుకున్న‌ట్టుగానే ఇప్పుడు సినిమాలో ఛాన్స్ కూడా కొట్టేశారు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కు మెగాస్టార్ కూడా స‌పోర్ట్ చేస్తాన‌ని మాటిచ్చారు.





అప్పుడే ఆకాశాన్ని అంటిన వకీల్ సాబ్ టికెట్స్ ధరలు......

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు

అటు హీరోకి మరియు డైరెక్టర్ కు స్టార్ హోదా తెచ్చిన సినిమాలేంటో తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>