PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagar9c09bebd-a81c-4019-87a8-f24806dc0fd0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagar9c09bebd-a81c-4019-87a8-f24806dc0fd0-415x250-IndiaHerald.jpgతాము దుబ్బాకలో ప్రచారం చేయకపోవడం వల్లే ఓడిపోయామనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా వెల్లడించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్.. తర్వాత నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎన్నిక గురించి చెబుతూ.. ఈజీగా గెలుస్తామనే భావనతో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామని కేసీఆర్ చెప్పారు.KCR NAGARJUNA SAGAR;kcr;ktr;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;nalgonda;assembly;sircilla;josh;siddipet;partyదుబ్బాక ఓటమికి కారణం చెప్పిన కేసీఆర్దుబ్బాక ఓటమికి కారణం చెప్పిన కేసీఆర్KCR NAGARJUNA SAGAR;kcr;ktr;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;nalgonda;assembly;sircilla;josh;siddipet;partyMon, 29 Mar 2021 19:50:08 GMTసిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది. దుబ్బాక సీఎం కేసీఆర్ సొంత జిల్లా. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, కేటీఆర్ నియోజక వర్గం సిరిసిల్ల, హరీశ్‌రావు ఇలాకా సిద్దిపేట.. ఈ మూడు ప్రాంతాలకు మధ్యలో ఉంది దుబ్బాక. దుబ్బాక నుంచి నాలుగుసార్లు గెలిచింది టీఆర్ఎస్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డి రికార్డ్ మెజార్టీలో గెలిచారు. ఆయన అకాల మరణంతో జరిగింది ఉప ఎన్నిక.ర అయితే రెండేండ్లకే అక్కడ ఫలితం మారిపోయింది. కేసీఆర్ సొంత గడ్డలో.. అధికార పార్టీని అదికూడా సెంటిమెంట్ ను అధిగమించి సంచలన విజయం సాధించింది బీజేపీ.

దుబ్బాకలో ఓటమి టీఆర్ఎస్ ను కలవరపరిచింది. దాని ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనా పడింది. దుబ్బాక జోష్ తో గ్రేటర్ లోనూ ఊహించని ఫలితాలు సాధించింది బీజేపీ. ఈ రెండు ఫలితాలపై పోస్ట్ మార్టమ్ చేసిన గులాబీ బాస్.. పార్టీ ఓటమికి అసలు కారణం కనిపెట్టేశారట. తాము దుబ్బాకలో ప్రచారం చేయకపోవడం వల్లే ఓడిపోయామనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా వెల్లడించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్.. తర్వాత నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎన్నిక గురించి చెబుతూ.. ఈజీగా గెలుస్తామనే భావనతో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామని కేసీఆర్ చెప్పారు.

ఒక్క హరీశ్‌కే వదిలేయకుండా.. తామిద్దరం సైతం జోక్యం చేసుకొని ఉంటే.. దుబ్బాకలో ఫలితం మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు. అందుకే, దుబ్బాకలో చేసిన తప్పిదం నాగార్జున సాగర్‌లో రిపీట్ అవకుండా చూస్తామని చెప్పారు. సాగర్ ప్రచారానికి తనతో పాటు కేటీఆర్‌ కూడా వస్తారని నియోజక వర్గ నేతలకు అభయం ఇచ్చారు కేసీఆర్. నోముల భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న నేతలను పిలిపించి మాట్లాడారు గులాబీ బాస్. అంతర్గత విభేదాలు పక్కనబెట్టి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు సూచించారు. నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. మరోనేత చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్‌ చేస్తామని చెప్పారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని.. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో నాయకులంతా సాగర్‌లో కష్టపడాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్.





'సైనా నెహ్వాల్' బయోపిక్ కోసంమొదట ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేసారో తెలుసా..ఆ హీరోయిన్ తో షూటింగ్ కూడా చేసారు..!!

అప్పుడే ఆకాశాన్ని అంటిన వకీల్ సాబ్ టికెట్స్ ధరలు......

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>