PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-ncp-plan-to-check-shiva-sena-in-maharashtra-687ae735-03ab-4008-aa5c-3ec12b9e19e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-ncp-plan-to-check-shiva-sena-in-maharashtra-687ae735-03ab-4008-aa5c-3ec12b9e19e8-415x250-IndiaHerald.jpgశివ‌సేన‌-ఎన్సీపీ మ‌ధ్య గ్యాప్ పెరిగిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలోనే ప‌వార్‌-ఉద్ద‌వ్‌థాక్రే ల మ‌ధ్య నెల‌కొన్న కోల్డ్‌వార్ కాస్త ఇప్పుడు ర‌చ్చ‌కెక్కుతోంది. అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ...ఈ గ్యాప్‌లో త‌న స‌త్తా చాటాల‌ని యోచిస్తోందంట‌. ఈక్ర‌మంలోనే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎటువంటి వివరాలూ బయటకు రాన‌ప్ప‌టికీ...భేటీ జ‌రిగిన మాట మాత్రం వాస్త‌వ‌మేన‌ని అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌తో అర్థ‌మ‌వుతోంది. విలేకరుల సమావేశం ఏరncp;amit shah;bharatiya janata party;maharashtra - mumbai;sharad pawar;amith shah;government;media;minister;maharashtra;shiv sena;congress-ncp;central government;saamna newspaperథాంక్రే ప్ర‌భుత్వానికి కాలం ద‌గ్గ‌ర‌ప‌డుతోందా..? అమిత్ షా స్కెచ్ గీసేశాడా..?థాంక్రే ప్ర‌భుత్వానికి కాలం ద‌గ్గ‌ర‌ప‌డుతోందా..? అమిత్ షా స్కెచ్ గీసేశాడా..?ncp;amit shah;bharatiya janata party;maharashtra - mumbai;sharad pawar;amith shah;government;media;minister;maharashtra;shiv sena;congress-ncp;central government;saamna newspaperMon, 29 Mar 2021 08:37:02 GMTఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎటువంటి వివరాలూ బయటకు రాన‌ప్ప‌టికీ...భేటీ జ‌రిగిన మాట మాత్రం వాస్త‌వ‌మేన‌ని అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌తో అర్థ‌మ‌వుతోంది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అమిత్‌ షాను మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించ‌గా ‘ప్రతిదీ బయటకు చెప్పలేం’ కదా అని బదులివ్వ‌డం గ‌మ‌నార్హం.


భేటీ జరిగిందని గానీ, జరగలేదని గానీ ధ్రువీకరించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది. మొత్తానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారన్న ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. అమిత్ షాతో శరద్ పవార్ భేటీని ఎన్సీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నప్పటికీ... దేశంలో ఒక దిగ్గజ నేతగా రాజకీయాలకు అతీతంగా ఆయనకు విస్తృత సంబంధాలు ఉంటాయని చెప్తుండటం గమనార్హం. మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలు కూడా తాజా ప్రచారానికి ఊతమిస్తున్నాయి. పవార్‌తో భేటీపై స్పందించేందుకు నిరాకరించిన అమిత్ షా... అన్నీ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.


సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీకి చెందిన హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవార్‌, ఆ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత అహ్మదాబాద్‌లో శనివారం అమిత్‌షాతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. హోంమంత్రి రాజీనామాకు ఓ వైపు మహారాష్ట్రలోని ప్రతిపక్ష భాజపా పట్టుబడుతున్న వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో రెండు పార్టీలకు చెందిన నేతలే పాల్గొన్నారా? వేరే ఇంకెవరైనా పాల్గొన్నారా? ఇంతకీ ఏం చర్చించారు? అనే దానిపై సమాచారం లేదు. మరోవైపు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ‘సామ్నా’ పత్రికలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయన అనుకోకుండా హోంమంత్రి అయ్యారని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.


పప్పులో కాలేసిన సింగర్...ఆడేసుకున్న నెటిజన్లు.!

కాంగ్రెస్ నేతలకు జానారెడ్డి షాక్...?

టీడీపీ ఎమ్మెల్యేతో పవన్ చర్చలు...?

అన్నీ అదరగొడుతున్న కేసీఆర్ గారూ.. ఈ సంగతి పట్టించుకోరేంటి సారూ..!?

మణిశర్మ వల్లే ఆ చిత్రానికి సంగీతం అందించేలేక పోయాను.. దేవిశ్రీ..?

వచ్చే ఎన్నికలకు పవన్ సూపర్ ప్లాన్...?

తిరుపతిలో టీడీపీ భయపడుతుందా...? అంతా బాబు తపనే...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>