PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/telangana-congress-situation-in-nagarjuna-sagar-by-electionc5bc3479-60db-463e-94e9-527d2c2a7855-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/telangana-congress-situation-in-nagarjuna-sagar-by-electionc5bc3479-60db-463e-94e9-527d2c2a7855-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగర్ ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్ కి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణలో ప్రతిపక్ష స్థానంలో ఉండాల్సిన కాంగ్రెస్, ఎమ్మెల్యేలను చేజార్చుకుని డీలా పడింది. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో వరుస ఓటములు కాంగ్రెస్ పార్టీని కుంగదీసింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో మరీ దారుణమైన ఫలితాలు రావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవడంతో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ఉందా లేదా అనే డౌట్ వస్తోంది. మరోవైపు షర్మిల కొత్త పార్టీతో కాంగ్రెస్ కే అధిక నష్టం ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దశలో నాగారnagarjuna sagar, jana reddy, sagar by elections;nagarjuna akkineni;manu;vishwa;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;tpcc;assembly;janareddy;central government;reddy;partyసాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవోసాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవోnagarjuna sagar, jana reddy, sagar by elections;nagarjuna akkineni;manu;vishwa;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;tpcc;assembly;janareddy;central government;reddy;partySun, 28 Mar 2021 09:05:00 GMTనాగార్జున సాగర్ ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్ కి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణలో ప్రతిపక్ష స్థానంలో ఉండాల్సిన కాంగ్రెస్, ఎమ్మెల్యేలను చేజార్చుకుని డీలా పడింది. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో వరుస ఓటములు కాంగ్రెస్ పార్టీని కుంగదీసింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో మరీ దారుణమైన ఫలితాలు రావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవడంతో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ఉందా లేదా అనే డౌట్ వస్తోంది. మరోవైపు షర్మిల కొత్త పార్టీతో కాంగ్రెస్ కే అధిక నష్టం ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దశలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే.. ఆ పార్టీకి తెలంగాణలో మనుగడ ఉంటుందనే మాట వాస్తవం.

ప్రస్తుతం సాగర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికంటే సీనియర్లు ఎవరూ లేరు. 2018 ఎన్నికల్లో కూడా కేవలం 7,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు జానా రెడ్డి. ఈసారి కూడా ఆయనే అభ్యర్థి కావడంతో గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ దశలో జానా రెడ్డి తనయుడికి టికెట్ ఇస్తారని భావించినా, విజయావకాశాలు తగ్గుతాయనే నేపథ్యంలో చివరికి కాంగ్రెస్ అధిష్టానం జానారెడ్డివైపే మొగ్గు చూపింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండేళ్లకు వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టడుగు స్థాయికి చేరుకుంది. ఓటుబ్యాంకు పూర్తిగా గల్లంతయింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ ఇవ్వలేక చతికిలబడింది. దీంతో కాంగ్రెస్ లో సీనియర్లు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీకోసం పోరాడేవారు కరువయ్యారు. టీపీసీసీ పీఠం కోసం కొట్టుకుంటున్నారే కానీ, తెలంగాణలో పార్టీ భవిష్యత్ గురించి ఆలోచించేవారు లేరు.

ఈ దశలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయలోపం ఈ ఎన్నికల ప్రచారంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కేంద్ర  నాయకత్వాన్ని ప్రచారానికి రప్పించే సాహసం కూడా ఎవరూ చేయడంలేదు. మరోవైపు బీజేపీ ఎలాగైనా ఈ ఎన్నికల గెలవాలని ఆలోచిస్తోంది. ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో బీజేపీ చావుదెబ్బతిన్నది. సిట్టింగ్ స్థానాన్ని కూడా చేజార్చుకుంది. ఈ దశలో టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇవ్వవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అభ్యర్థి జానారెడ్డి సొంత బలం మినహా.. కాంగ్రెస్ పార్టీ బలం సాగర్ లో పనిచేసేలా కనిపించడంలేదు. ఒకరకంగా తెలంగాణలో మనుగడకోసం సాగర్ లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కి వచ్చింది.




బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>