PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/smashaan10fc3bcb-0e65-43e8-89e0-2ae4b8230ae4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/smashaan10fc3bcb-0e65-43e8-89e0-2ae4b8230ae4-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వైకుంఠ‌ధామాల నిర్మాణాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. మనిషి జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు పుట్టుక, చావు. పుట్టిన వేడుకలు ఎవరి స్థాయిని బట్టి వారు చేసుకుంటారు. చావులో మాత్రం పేద, ధనిక తేడాలేకుండా చివరి యాత్ర సుఖమయంగా సాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే మోడ్రన్ వైకుంఠధామాల నిర్మాణానికి తెలంగాణ‌ప్ర‌భుత్వం చేప‌డుతోంది. . వైకుంఠధామంలో పూర్తిగా ఉద్యాన వనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మధ్యలో నాలుగు బర్నింగ్ ఫ్లాట్ ఫాంలతో కూడిన ఓ షెడ్smashaan;jeevitha rajaseskhar;vidya;telangana;district;mandalam;aqua;local language;yatraవీళ్ల తెలివి తెల్లారిన‌ట్లే ఉంది.. రిజ‌ర్వాయ‌ర్‌లో శ్మ‌శానం...వీళ్ల తెలివి తెల్లారిన‌ట్లే ఉంది.. రిజ‌ర్వాయ‌ర్‌లో శ్మ‌శానం...smashaan;jeevitha rajaseskhar;vidya;telangana;district;mandalam;aqua;local language;yatraSun, 28 Mar 2021 14:34:29 GMTతెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వైకుంఠ‌ధామాల నిర్మాణాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. మనిషి జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు పుట్టుక, చావు. పుట్టిన వేడుకలు ఎవరి స్థాయిని బట్టి వారు చేసుకుంటారు. చావులో మాత్రం పేద, ధనిక తేడాలేకుండా చివరి యాత్ర సుఖమయంగా సాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే మోడ్రన్ వైకుంఠధామాల నిర్మాణానికి తెలంగాణ‌ప్ర‌భుత్వం చేప‌డుతోంది. . వైకుంఠధామంలో పూర్తిగా ఉద్యాన వనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మధ్యలో నాలుగు బర్నింగ్ ఫ్లాట్ ఫాంలతో కూడిన ఓ షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు. దాని ముందు అంత్యక్రియలకు హాజరైన వారు కూర్చోవడానికి వీలుగా బర్నింగ్ ఫ్లాట్ ఫాంకు చుట్టూ సిట్టంగ్ గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు.



అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్నానాలు చేసుకోవడానికి స్నానపు గదులను నిర్మిస్తున్నారు.  రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో వైకుంఠ ధామాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ. 200 కోట్లు ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోని మహాప్రస్థానం తరహాలో వీటిని నిర్మిస్తారు. ప్రహరీ, విద్యుత్‌ దీపాలు, మొక్కలు, వేయిటింగ్‌ రూం, ఆస్తికలు నిల్వ చేయడానికి, నీటి సౌకర్యం, రోడ్డు ఉండేలా నిర్మించనున్నారు. నగరాల్లో ఇప్పుడున్న వాటికి అదనంగా మరికొన్నింటిని నిర్మిస్తారు. ఇదిలా ఉండ‌గా అనేక చోట్ల, ముఖ్యంగా ప‌ల్లెల్లో వీటి నిర్మాణంపై ప‌ర్య‌వేక్ష‌ణ కొర‌వ‌డ‌టంతో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ‌.. ఎలా ప‌డితే అలా నిర్మాణం చేప‌డుతున్నారు. జ‌న‌గామ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రిజర్వాయర్లో శ్మ‌శాన వాటికను నిర్మిస్తుండ‌టం హాస్యాస్ప‌దంగా మారింది.


 స్థానిక పాలకులు. అధికారులు చూసిచూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిల్పూర్ మండలంలోని దేశాయి తండా గ్రామ పరిధిలో స్మశాన వాటిక నిర్మిస్తున్నారు. పక్కనే ఉన్న రిజర్వాయర్ లో పిల్లర్ లెవల్లో పనులు జరిగాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి చేస్తున్న ఈ నిర్మాణం పట్ల గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ లో స్మశాన వాటిక నిర్మించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇక్కడ నిర్మించేందుకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నిర్మాణం పట్ల ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉండేదని, అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిర్మాణ పనులు చేపడుతున్నారని, రిజర్వాయర్ నిండితే నీళ్లలోనే స్మశాన వాటిక ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ నీళ్లలో నిర్మిస్తున్న స్మశానవాటిక పట్ల ఉన్నాతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


కవిత షర్మిలకు హెల్ప్ చేసారా...?

నాని 'ఫ్యాన్స్ కామెంట్' ఆ హీరోలకు కౌంటరా ?

వైఎస్ షర్మిలతో పార్టీ పెట్టించింది ఎవరో తెలిసిపోయింది!!

టీఆర్ఎస్ చేరేందుకు కొండా షరతు!

పూరి జగన్నాధ్ అంత రిస్క్ చేస్తున్నాడా...?

ఓట్ల కోసం హిందువులను టార్గెట్ చేస్తున్న స్టాలిన్..

తిరుపతి ఉప ఎన్నిక : కేసీఆర్ కామెంట్స్ ను అస్త్రంగా మార్చుకుంటున్న టీడీపీ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>