PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmersaaf1a335-c1b7-466d-9463-2e2f33405ea3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmersaaf1a335-c1b7-466d-9463-2e2f33405ea3-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లు చట్టాలను ప్రవేశపెట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు గత కొద్దీ రోజుల నుండి నిరసనలు చేస్తున్నారు ఉన్నారు. తు ఉద్యమానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు పంజాబ్ రైతులు దేహ శుద్ధి చేశారు. నడిరోడ్డుపై బట్టలు చించి, ముఖంసై ఇంక్ చల్లి చితకబాదారు.farmers;delhi;bharatiya janata party;amarinder singh;congress;police;chief minister;job;car;mla;arrest;central government;punjabనడిరోడ్డుపై ఎమ్మెల్యే బట్టలు చింపి చితకబాదిన రైతులు..!నడిరోడ్డుపై ఎమ్మెల్యే బట్టలు చింపి చితకబాదిన రైతులు..!farmers;delhi;bharatiya janata party;amarinder singh;congress;police;chief minister;job;car;mla;arrest;central government;punjabSun, 28 Mar 2021 10:00:00 GMTకేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లు చట్టాలను ప్రవేశపెట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు గత కొద్దీ రోజుల నుండి నిరసనలు చేస్తున్నారు ఉన్నారు. తు ఉద్యమానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు పంజాబ్ రైతులు దేహ శుద్ధి చేశారు. నడిరోడ్డుపై బట్టలు చించి, ముఖంసై ఇంక్ చల్లి చితకబాదారు. పోలీసులు ఎంటరైనా ఏమాత్రం తగ్గలేదు. దొరకబుచ్చుకుని మరీ కొట్టారు. బీజేపీ నేత, అబోహర్ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ శనివారం నాడు పంజాబ్‌లోని మాలోట్ నగరంలో గల బీజేపీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఇక ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌పై గుర్రుగా రైతులు.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అతని బట్టలను చించేశారు. ముఖంపై ఇంక్ జల్లారు. మసి పూసారు. అతని కారును కూడా ధ్వంసం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు కంట్రోల్ కాకపోవడంతో ఎమ్మెల్యేను పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి తీసుకెళ్లారు.ఈ ఘర్షణతో బీజేపీ నాయకులు తమ ప్రెస్‌మీట్‌ని క్యాన్సెల్ చేసుకుని వెళ్లిపోయారు. ఇదిలాఉంటే.. ఎమ్మెల్యేపై దాడి ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఈ దాడిని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ఉపేక్షించేది లేదని..ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక బీజేపీ శ్రేణులు కూడా ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు. రైతుల ముసుగులో కాంగ్రెస్ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతరేకంగా రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలపైన టిక్రీ, సింఘూ, ఘజియాబాద్‌లో గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసనలు కొనసాగిస్తున్నారు. కాగా, కేంద్రం తీరును నిరసిస్తూ శుక్రవారం నాడు రైతులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.


తెలంగాణాలో మరో ఎన్నికల సందడి...!

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>