PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-covid-in-schools-ap-corona-ap-schools-6ab396fa-5dec-4476-a9be-212343b25898-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-covid-in-schools-ap-corona-ap-schools-6ab396fa-5dec-4476-a9be-212343b25898-415x250-IndiaHerald.jpgఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. తొలిదశలో లాగా కాకుండా.. మలి దశలో స్కూల్ పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. గతంలో లాక్ డౌన్ కారణంగా ఎక్కడి స్కూళ్లు అక్కడ మూతబడటంతో పిల్లలకు కరోనా కేసులు నిర్థారణ అయిన దాఖలాలు లేవు. అయితే సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో స్కూల్స్ ఇంకా తెరిచే ఉంచడం వల్ల కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నయి. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం, స్కూల్స్ కి సెలవలు ప్రకటించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. covid, covid in schools, ap corona, ap schools,;suresh;raja;suma;suma kanakala;tiru;audimulapu suresh;andhra pradesh;district;government;school;tirupati;minister;husbandస్కూళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు..స్కూళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు..covid, covid in schools, ap corona, ap schools,;suresh;raja;suma;suma kanakala;tiru;audimulapu suresh;andhra pradesh;district;government;school;tirupati;minister;husbandSun, 28 Mar 2021 07:00:00 GMTస్కూల్ పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. గతంలో లాక్ డౌన్ కారణంగా ఎక్కడి స్కూళ్లు అక్కడ మూతబడటంతో పిల్లలకు కరోనా కేసులు నిర్థారణ అయిన దాఖలాలు లేవు. అయితే సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో స్కూల్స్ ఇంకా తెరిచే ఉంచడం వల్ల కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నయి. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం, స్కూల్స్ కి సెలవలు ప్రకటించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

తెలంగాణతో పోల్చి చూస్తే ఏపీలోనే కరోనా కేసుల సంఖ్య ఎక్కువ. అయితే తెలంగాణలో ఈపాటికే స్కూల్స్ మూసివేశారు. మిగతా కార్యకలాపాలన్నీ అలాగే జరుగుతున్నా.. ముందు జాగ్రత్తగా స్కూల్స్, కాలేజీలు మూసేసి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఏపీలో మాత్రం అలాంటి చర్యలకు ప్రభుత్వం సుముఖంగా లేదు. కరోనా కేసులు బయటపడిన స్కూల్స్ లేదా కాలేజీలు మాత్రమే మూసివేయాలని, మిగతావాటిని యథావిధిగా నడిపించాలని సూచిస్తున్నారు నేతలు. స్కూళ్ల విషయంలో త్వరపడి నిర్ణయం తీసుకోవడం కంటే.. వేచి చూసే ధోరణిలో ఉంది ఏపీ ప్రభుత్వం. అయితే మరోవైపు పెరుగుతున్న కేసులు మాత్రం భయాందోళనలు కలిగిస్తున్నాయి. దీంతో స్కూళ్ల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

ముందు జాగ్రత్త అవసరమేనా..?
రాష్ట్రంలో శనివారం ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్టు అధికారిక సమాచారం. ఆంధ్రా యూనివర్శిటీలో 30మంది, శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో 10మంది, కర్నూలు జిల్లాలోని ఐదు విద్యాసంస్థల్లో మొత్తం ఏడుగురు, తిరుపతి గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ లో మరో ఏడుగురికి కరోనా సోకింది. రాజమండ్రిలో 50మంది విద్యార్థులు కూడా కరోనాబారిన పడ్డారు. ఏయూలో కరోనా సోకిన వారందర్నీ, ఇంజినీరింగ్‌ విభాగంలోనే ఐసొలేషన్ ‌లో ఉంచారు. కరోనా నేపథ్యంలో ఏయూ హాస్టళ్లన్నింటినీ మూసేసి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించబోతున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మిగతా స్కూల్స్, కాలేజీలు యథావిధిగా నడుస్తాయని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే కరోనా కేసులు పెరిగితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సి ఉంటుంది.




సాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవో

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>