Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mangoe1124d1e-4202-4ebc-8f77-05b4090b87f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mangoe1124d1e-4202-4ebc-8f77-05b4090b87f5-415x250-IndiaHerald.jpg వేసవి వచ్చిందంటే చాలు అందరి చూపు మామిడి పండు వైపే.. మామిడి పండు తినడానికి పిల్లలు. పెద్దలు మామిడి అంతగా ఇష్టపడతారు. అందుకనే మామిడి పండును పండ్లకు రారాజు అని కూడా అంటారు. రుచిలో అద్భుతమనిపించే మామిడిలో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. కాల్షియం, విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది మామిడిలో. ఇక మామిడి రుచిలోనే కాదు శరీర సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. వివిధ రుచుల్లో ఆకారాల్లో, సైజుల్లో, రంగుల్లో లభించే మామిడి పండ్లలో ఎన్నో రకాల ఔషధగుణాలు , ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయిmango;iron;vitamin;heart;copperమామిడి పండు తింటే బరువు పెరుగుతారా....?మామిడి పండు తింటే బరువు పెరుగుతారా....?mango;iron;vitamin;heart;copperSun, 28 Mar 2021 06:00:00 GMTవిటమిన్ బి ఎక్కువగా ఉంటుంది మామిడిలో. ఇక మామిడి రుచిలోనే కాదు శరీర సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. వివిధ రుచుల్లో ఆకారాల్లో, సైజుల్లో, రంగుల్లో లభించే మామిడి పండ్లలో ఎన్నో రకాల ఔషధగుణాలు , ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏడాదిలో ఒక్కసారి దొరుకుతాయి.. తినడకుండా ఉంటామా అంటూ కొందరు తెగ లాగించేస్తే.. మరికొందరు.. లావు అయిపోతామేమో అనే భయంతో పక్కన పెట్టేస్తారు.. ఆయితే మామిడిపండు తింటే బరువు పెరుగుతారా అనే విషయంపై న్యూట్రిషనిస్ట్ పలు సూచనలు చేశారు. అవి ఏమిటో చూద్దాం..!


మామిడి పండు తింటే ఊబకాయం వస్తుందనేది పూర్తిగా అపోహే అని అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. మామిడి పండును నేరుగా అలా తీసుకుంటే బరువు పెరుగుతారనే ప్రసక్తే ఉండదు. ఐతే.. కొంత మంది ఐస్ క్రీముల్లో, మిల్క్ షేకుల్లో మామిడి పండును మిక్స్ చేసి తీసుకుంటుంటారు. ఇటువంటివి తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే.. ఎంచక్కా మామిడి పండును ముక్కులుగా కోసుకుని తినేయండి. లేదా రసం చేసుకుని తాగండి. ఐతే.. ఇందులో ఐస్ క్యూబ్స్ లేదా చక్కెర వంటికి మిక్స్ చేయకండి. అవి యాడ్ చేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ.


మామిడిపండులో విటమిన్ - ఏ, విటమిన్ - డి, విటమిన్ - సి, కాపర్, ఫోలేట్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు మాత్రం ఒకే ఒక్క శాతం ఉంటుంది. ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. మామిడిలో ఉండే పీచు పదార్థాలు గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో దోహదపడతాయి.

మామిడి పండులో జీర్ణ క్రియను మెరుగుపరిచే ఎంజైమ్స్, ఫైబర్ కంటెంటె చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పచ్చగా ఉండే మామిడి కాయలో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది. అందుకే జీర్ణ సంబంధ సమస్యలతో సతమతమయ్యే వారు వీటిని తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే.. సన్నగా ఉండే వారు మామిడి పండ్లను తింటే ఆరోగ్యకరంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

చాలా మంది అన్నంతో కలిపి మామిడి పండును తింటుంటారు. కానీ ఇది అంత మంచిది కాదని అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. మామిడి పండు తినే సమయంలో మరే ఇతర ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే స్నాక్స్ టైమ్‌లో మామిడి పండును తీసుకుంటే ఇంకా మంచిది. అలాగే.. ఉదయం, సాయంత్రం పూట తినడం వల్ల శరీరంలో అదనపు కేలరీలు చేరకుండా ఉంటాయి.


రక్త హీనతతో బాధపడే వారు రోజుకో మ్యాంగో తింటే మంచిది. మామిడి పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఫలితంగా రక్తం వృద్ధి చెందుతుంది. మామిడి కాయ లేదా పండు తింటే పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. నోటిలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించి దంతలు శుభ్రపడతాయి. చర్మంలో సహజమైన గ్లో పెంచడంలోనూ మామిడి సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులోని బిటాకెరోటిన్.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.


ఈ స్టార్స్ ఎలా చనిపోయారో ఇప్పటికీ రహస్యమే..!

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>