PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/abn-radhakrishna3afd1337-4d8a-4e1e-9aa3-8d4e4e51fb35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/abn-radhakrishna3afd1337-4d8a-4e1e-9aa3-8d4e4e51fb35-415x250-IndiaHerald.jpgఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు జగన్ అంటే ఎంత ద్వేషమో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ఏమీ దాచుకోడు.. ఇక ఆంధ్రజ్యోతి దిన పత్రిక వైఖరి ఏంటో పాఠకులకు బాగానే తెలుసు..ఈ విషయం బహిరంగ రహస్యమే. అలాగే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చంద్రబాబు అనుకూలుడన్న పేరు బాగా ఉంది. అందుకే ఆయన తన పత్రికలో ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తుంటారు.. అలాగే కొందరు వైసీపీ నేతలు ఆంధ్రజ్యోతి చంద్రజ్యోతి అంటూ కామెంట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు దిమ్మతిరుగుతున్నట్టే ఉంది. ఆయనకు ఇప్పుడు జగన్ అరాచకాలు వర్ణabn-radhakrishna;jagan;ycp;vemuri radhakrishna;andhra jyothiజగన్ దెబ్బకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఎవరెవరు గుర్తుస్తున్నారో తెలుసా..?జగన్ దెబ్బకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఎవరెవరు గుర్తుస్తున్నారో తెలుసా..?abn-radhakrishna;jagan;ycp;vemuri radhakrishna;andhra jyothiSun, 28 Mar 2021 10:00:00 GMTఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు జగన్ అంటే ఎంత ద్వేషమో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ఏమీ దాచుకోడు.. ఇక ఆంధ్రజ్యోతి దిన పత్రిక వైఖరి ఏంటో పాఠకులకు బాగానే తెలుసు..ఈ విషయం బహిరంగ రహస్యమే. అలాగే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ  చంద్రబాబు అనుకూలుడన్న పేరు బాగా ఉంది. అందుకే ఆయన తన పత్రికలో ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తుంటారు.. అలాగే కొందరు వైసీపీ నేతలు ఆంధ్రజ్యోతి చంద్రజ్యోతి అంటూ కామెంట్ చేస్తుంటారు.

ఇక ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు దిమ్మతిరుగుతున్నట్టే ఉంది. ఆయనకు ఇప్పుడు జగన్ అరాచకాలు వర్ణించేందుకు పురాణాలు, పాత కవులను ఆశ్రయిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆయన కలికాలం, ధర్మరాజు అంటూ ఏవో కథలు చెప్పారు. ఇక ఇప్పుడు తాజా కొత్తపలుకులో  కవులను ఆశ్రయించారు. జగన్ దెబ్బకు రాధాకృష్ణకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురికి చెందిన శేషప్ప కవి గుర్తొచ్చేశాడు. ఆయన ఏనాడో 18వ శతాబ్దంలోనే రచించిన నారసింహ శతకం గుర్తొచ్చింది.

శేషప్పకవి ఏం చెప్పారంటే..” విద్యావంతులు అప్రయోజకులయ్యారు. శుంఠలు సభా పూజ్యులయ్యారు. సత్యవంతుల మాట జనానికి రుచించడం లేదు. వదరుబోతుల మాటే చెల్లుబాటు అవుతోంది. దుష్ట మానవులు వర్ధిల్లుతున్నారు.. అని చెప్పారట. ఆయనతో పాటు ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్‌ క్లిట్‌ గార్డ్‌ కూడా గుర్తొచ్చేశారు. ఆయన ఏమన్నారంటే.. “ ఏ సమాజంలోనైతే నీతి తప్పినవారు విజయం సాధిస్తారో, ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారో, ఎక్కడైతే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఎక్కడైతే అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా పట్టించుకోకుండా తమకు రావాల్సిన వాటా కోసం ప్రజలు అర్రులు చాస్తారో అక్కడ వ్యవస్థకు సంబంధించిన పునఃసమీక్షకు సమయం ఆసన్నమైనట్టే’... అని చెప్పారట.

పాపం.. జగన్ పాలన అరాచకం అని చెప్పడానికి రాధాకృష్ణ ఎంతగా కష్టపడుతున్నారో.. ఎక్కడెక్కడి పురాణాలు, పద్యాలు, సామాజిక వేత్తల మాటలను ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి మరీ ప్రస్తావిస్తున్నారు..


తెలంగాణాలో మరో ఎన్నికల సందడి...!

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>