EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anxiety-in-myanmar-tension7c6619e9-60c2-4de5-b5c0-328a88818021-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anxiety-in-myanmar-tension7c6619e9-60c2-4de5-b5c0-328a88818021-415x250-IndiaHerald.jpgచిన్న దేశం మ‌య‌న్మార్ సైన్యం చేతిలో ప‌డి విల‌విల‌లాడుతోంది. ఎదురుతిరిగిన ప్ర‌జానీకాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తోంది సైన్యం. నిత్యం పదుల సంఖ్య‌లో ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మయన్మార్‌లో ప్రజలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలు రోజు రోజుకీ హింసాత్మకంగా మారుతున్నాయి. సైనిక తూటాలకు అమాయకులు బలవుతున్నారు. దాదాపు రెండు నెలలుగా మాయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ప్రజలపై సైన్యం అణచివేత ధోరణి కొనసాగుతోంది. ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఇmayanmar;nithya new;tiru;police;media;february;fire;local languageర‌క్త‌దాహం తీర్చుకుంటున్న సైన్యం... ఇంకెన్నాళ్లు బందీగా మ‌య‌న్మార్‌...ర‌క్త‌దాహం తీర్చుకుంటున్న సైన్యం... ఇంకెన్నాళ్లు బందీగా మ‌య‌న్మార్‌...mayanmar;nithya new;tiru;police;media;february;fire;local languageSun, 28 Mar 2021 08:44:28 GMTమీడియా విడుదల చేసిన నివేదికలో తేలింది.


తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మంది చనిపోయారని వివరించింది.దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉండే ఇక్కడ ఆందోళనకారులపై పోలీసులు పెద్దఎత్తున కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ పేర్కొన‌డం అక్క‌డి ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. ఆందోళనల్లో పాల్గొన్నవారిపై ఆదివారం సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం 100 మంది మృతిచెందారు. మాయన్మార్ ప్రధాన నగరం యాంగూన్‌ నగర శివార్లలోని పారిశ్రామికవాడలో 22 మంది చనిపోగా, వేర్వేరు చోట్ల మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. హ్లైంగ్‌తయా ప్రాంతంలో చైనా సహకారంతో నడుస్తోన్న మూడు గార్మెంట్‌ పరిశ్రమలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.


మయన్మార్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ఫిబ్రవరి 1న సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో కొద్ది వారాలుగా ప్రజాందోళనలు మిన్నంటుతున్నాయి. అత్యంత దారుణంగా వ్యవహరిస్తోన్న సైనిక ప్రభుత్వం.. తన చర్యలను సమర్ధించుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించి, ప్రజలను కాపాడటానికే ప్రయత్నిస్తున్నామని సైనిక ప్రభుత్వాధినేత జుంటా ప్రకటించాడు. ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా మాయన్మార్‌లోని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. సైన్యం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. ప్ర‌పంచ దేశాల‌కు క‌లుగ‌జేసుకుని త‌మ‌కు విముక్తి ప్ర‌సాదించాల‌ని మయ‌న్మార్ ప్ర‌జ‌లు వేడుకుంటున్నారు.


ఎమ్మెల్యేలకు ముహూర్తం పెట్టిన జగన్...?

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>