MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakulpreeth-16bf8c6a-ab77-41de-9960-7cfe25e9a0af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakulpreeth-16bf8c6a-ab77-41de-9960-7cfe25e9a0af-415x250-IndiaHerald.jpg టాప్ యంగ్ హీరోలు అందరితోను నటించి అనేక సూపర్ హిట్స్ అందుకున్న రకుల్ ప్రీత్ హవా ఇప్పుడు పూర్తిగా మసగ బారిపోయింది. వైష్ణవ్ తేజ్ లాంటి ఒక కొత్త హీరోతో రకుల్ సినిమా చేస్తోంది అంటే ఆమెకు అవకాశాలు ఎలా కనుమరుగు అయిపోయాయో అర్థం అవుతుంది. బాలీవుడ్ పై ఈమె పెట్టుకున్న ఆశలు కూడ నెరవేరక పోవడంతో పోయినచోటనే వెతుక్కోవాలి అన్న సామెత ప్రకారం రకుల్ ప్రస్తుతం తనకు పరిచయం ఉన్న హీరోలు అందరికీ ఫోన్స్ చేసి తనకు అవకాశాలు ఇప్పించమని అడుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితుల మధ్య మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటరRAKULPREETH;;jeevitha rajaseskhar;rakul preet singh;bollywood;cinema;media;december;interview;vaishnav tejమాస్క్ ల పై రకుల్ ప్రీత్ ఆసక్తికర కామెంట్స్ !మాస్క్ ల పై రకుల్ ప్రీత్ ఆసక్తికర కామెంట్స్ !RAKULPREETH;;jeevitha rajaseskhar;rakul preet singh;bollywood;cinema;media;december;interview;vaishnav tejSun, 28 Mar 2021 10:00:00 GMTటాప్ యంగ్ హీరోలు అందరితోను నటించి అనేక సూపర్ హిట్స్ అందుకున్న రకుల్ ప్రీత్ హవా ఇప్పుడు పూర్తిగా మసగ బారిపోయింది. వైష్ణవ్ తేజ్ లాంటి ఒక కొత్త హీరోతో రకుల్ సినిమా చేస్తోంది అంటే ఆమెకు అవకాశాలు ఎలా కనుమరుగు అయిపోయాయో అర్థం అవుతుంది. బాలీవుడ్ పై ఈమె పెట్టుకున్న ఆశలు కూడ నెరవేరక పోవడంతో పోయినచోటనే వెతుక్కోవాలి అన్న సామెత ప్రకారం రకుల్ ప్రస్తుతం తనకు పరిచయం ఉన్న హీరోలు అందరికీ ఫోన్స్ చేసి తనకు అవకాశాలు ఇప్పించమని అడుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఈ పరిస్థితుల మధ్య మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత కరోనా పరిస్థితుల పై అదేవిధంగా మాస్క్ ల వాడకం పై ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. షూటింగ్ కోసం సెట్ పైకి వెళ్ళగానే అందరిని అనుమానంగా చూడవలసి వస్తోందని దీనితో చెప్పే డైలాగ్ మీద శ్రద్ధ పెట్టలేక తన చుట్టూ ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అన్న టెన్షన్ తనకు పెరిగిపోయిందని కామెంట్స్ చేసింది.


షూటింగ్ స్పాట్ కు రాగానే ముఖానికి పెట్టుకున్న మాస్క్ వెంటనే తీయవలసి వస్తోందని షూటింగ్ గ్యాప్ మధ్య తిరిగి మాస్క్ పెట్టుకున్నప్పుడు తన హెయిర్ స్టైల్ అంతా పాడవుతున్న పరిస్థితులలో తన హెయిర్ ను సరిదిద్దుకోవడానికి అనవసరంగా ఆలస్యం అవుతోంది అంటూ ఆమె తన బాధను వ్యక్త పరిచింది. అంతేకాదు దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ మొదలైన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మొదలైందని తన అభిమానులకు హెచ్చరికలు ఇస్తోంది.




గత సంవత్సరం డిసెంబర్ లో తనకు కరోనా వచ్చినప్పుడు తాను పడ్డ బాధ తన జీవితంలో మరిచిపోలేనని తన తల్లి తండ్రులకు దూరంగా ఉంటూ క్వారంటైన్ లో తాను పడ్డ నరకయాతన ఎవరికీ రాకూడదు అంటూ ఆమె ఆ విషయాలను గుర్తు చేసుకుంది. అయితే రకుల్ అభిమానులు మాత్రమే కాదు సాధారణ జనానికి కూడ కరోనా భయాలు పోయిన పరిస్థితులలో ఈమె మాటలను ఎవరు పట్టించుకుంటారు అన్నదే ప్రశ్న..  





తెలంగాణాలో మరో ఎన్నికల సందడి...!

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>