MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roopa-laxmi9233d273-2b69-46d4-9ea2-6f35ba1c798d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roopa-laxmi9233d273-2b69-46d4-9ea2-6f35ba1c798d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరో తల్లి పాత్రల్లో నటించి.. సినీ ప్రేక్షకులను అలరించిన వారిలో రూపలక్ష్మి ఒకరు. శ్రీ విష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకటే కథ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించి.. మంచి డైలాగులు, కామెడీ పంచులతో ప్రేక్షకులను ఎంతో అలరించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు.roopa laxmi;jeevitha rajaseskhar;lakshmi;prema;telugu;youtube;you tube;love;interview;comedy;heroఈ నటి జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తెలుసా..!ఈ నటి జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తెలుసా..!roopa laxmi;jeevitha rajaseskhar;lakshmi;prema;telugu;youtube;you tube;love;interview;comedy;heroSun, 28 Mar 2021 07:00:00 GMTహీరో తల్లి పాత్రల్లో నటించి.. సినీ ప్రేక్షకులను అలరించిన వారిలో రూపలక్ష్మి ఒకరు. శ్రీ విష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకటే కథ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించి.. మంచి డైలాగులు, కామెడీ పంచులతో ప్రేక్షకులను ఎంతో అలరించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. అందులో ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

రూప లక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. సినిమాల్లో.. సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉంటారు. ఈమె ఇప్పటివరకు తెలుగులో దాదాపు 50కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ప్రస్తుతం సినిమాలతోపాటు సీరియళ్లలోనూ నటిస్తున్నారు. అయితే చిన్నప్పుడు తను ఎన్నో కష్టాలను చూశానని ఆమె చెప్పుకొచ్చింది. తను పేద కుటుంబానికి చెందిన దానినని, వ్యవసాయంలో నష్టం వస్తే కుటుంబ పోషణ భారమయ్యేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో పూట గడవడం కూడా కష్టంగా ఉండేదన్నారు. అందుకే ఆమె తల్లిదండ్రులు తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూడవ తరగతి చదువుతున్నప్పుడే తనని దత్తత ఇచ్చారని, అప్పటి నుంచి తన జీవితం ఎంతో మారిందన్నారు. తనని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఎంతో బాగా చూసుకునేవారని రూప లక్ష్మి పేర్కొన్నారు.

అయితే దత్తత తీసుకున్న ఇంట్లోని ఇతర కుటుంబీకులు మాత్రం తనని పక్కన పెట్టేవారన్నారు. తనని కుటుంబ సభ్యురాలిగా అంగీకరించకపోవడంతో ఎంతో ఇబ్బందులు పడ్డానని ఆమె వాపోయారు. స్టడీ బాగానే కొనసాగుతున్నా.. కొన్ని కారణాల వల్ల చదువుపై విసుగొచ్చి వదిలేశానని రూపలక్ష్మి చెప్పారు. చదువు మానేసిన తర్వాత ఓ విషయం పొరుగింటి వారి ద్వారా తెలిసింది. నేను వీరికి దత్తత పుత్రికనని, సొంత తల్లిదండ్రులు ఉన్నారని తెలిసిందన్నారు. అప్పుడు వాళ్లు దగ్గరికి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. చిన్నప్పటి ప్రేమ, పెంచిన ప్రేమకు దూరంగా బతికానని ఆమె భావోద్వేగానికి లోనవుతూ చెప్పుకొచ్చారు.


ఎమ్మెల్యేలకు ముహూర్తం పెట్టిన జగన్...?

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>