MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kruthi-sananfe975753-1923-46c4-9229-061ba7c5ab20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kruthi-sananfe975753-1923-46c4-9229-061ba7c5ab20-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వన్-నేనొక్కడినే. ఏడేళ్ల క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ద్వారా తొలిసారిగా బాలీవుడ్ నటి కృతిసనన్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. adipurush;mahesh;prabhas;naga chaitanya;kumaar;abinaya;krishnam raju;kriti sanon;seetha;sukumar;bollywood;cinema;rajani kanth;audience;thriller;heroineప్చ్ ... పాపం..... సీత పాత్ర కోసం తెగ కష్టపడుతోందట .... ??ప్చ్ ... పాపం..... సీత పాత్ర కోసం తెగ కష్టపడుతోందట .... ??adipurush;mahesh;prabhas;naga chaitanya;kumaar;abinaya;krishnam raju;kriti sanon;seetha;sukumar;bollywood;cinema;rajani kanth;audience;thriller;heroineSat, 27 Mar 2021 20:50:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వన్-నేనొక్కడినే. ఏడేళ్ల క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ద్వారా తొలిసారిగా బాలీవుడ్ నటి కృతిసనన్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

నిజానికి మూవీ ఫెయిల్ అయినప్పటికీ సినిమాలోని తన ఆకట్టుకునే అందం అభినయంతో కృతిసనన్ తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా తెరకెక్కిన దోచేయ్ మూవీలో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ దానితో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆపై పూర్తిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిమితమైన కృతి అతి త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ మూవీ లో సీత పాత్రలో నటించేందుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న కృతి ఒక్కసారిగా ఇంత భారీ సినిమాలో తనకు హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఎంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారట.

అయితే అసలు విషయం ఏమిటంటే ఆదిపురుష్ లో తాను చేయబోయే సీత పాత్ర కోసం కృతి ఎంతో కష్టపడుతుందని అలానే గతంలో సీత పాత్రల్లో నటించిన పలువురు సీనియర్ నటీమణులు నుండి ఆమె సలహాలు కూడా తీసుకుంటుందట. కాగా సీతా మాత పాత్ర చేయడం అంత సులువు కాదని అయితే పక్కాగా యాక్టింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్న కృతి తప్పకుండా స్క్రీన్ పై రేపు తన నటన తో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఆదిపురుష్ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!


దేశంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>