MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalu-4b01c230-9667-437d-a978-aa070a7c39d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalu-4b01c230-9667-437d-a978-aa070a7c39d0-415x250-IndiaHerald.jpgఇటీవలే వచ్చిన జాతిరత్నాలు సినిమా ప్రభంజనం ఇంకా తగ్గట్లేదు.. ఆ సినిమా తర్వాత నాలుగైదు సినిమాలు వచ్చినా ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో జాతిరత్నాలకు ఎదురులేకుండా పోయింది. జాతిరత్నాలు సినిమా నిజంగా ఓ జాతిరత్నంగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. నవీన్ పోలిశెట్టి కి నిజంగా ఓ మంచి హిట్ దక్కింది.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తో హీరోగా వచ్చిన నవీన్ రెండో సినిమా ని ఈ రేంజ్ లో సూపర్ హిట్ సినిమా చేయడం అంటే అయన క్రేజ్ మరింత పెరిగినట్లే అని చెప్పాలి.. jathirathnalu;atreya;naveen polishetty;tollywood;cinema;history;blockbuster hit;house;nijam;krack;chitramఈవారం కూడా జాతిరత్నాలకు ఎదురులేదు.. ఉప్పెన ని మించిందే..!!ఈవారం కూడా జాతిరత్నాలకు ఎదురులేదు.. ఉప్పెన ని మించిందే..!!jathirathnalu;atreya;naveen polishetty;tollywood;cinema;history;blockbuster hit;house;nijam;krack;chitramSat, 27 Mar 2021 12:00:00 GMTసినిమా ప్రభంజనం ఇంకా తగ్గట్లేదు.. ఆ సినిమా తర్వాత నాలుగైదు సినిమాలు వచ్చినా ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో జాతిరత్నాలకు ఎదురులేకుండా పోయింది. జాతిరత్నాలు సినిమా నిజంగా ఓ జాతిరత్నంగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. నవీన్ పోలిశెట్టి కి నిజంగా ఓ మంచి హిట్ దక్కింది.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తో హీరోగా వచ్చిన నవీన్ రెండో సినిమా ని ఈ రేంజ్ లో సూపర్ హిట్ సినిమా చేయడం అంటే అయన క్రేజ్ మరింత పెరిగినట్లే అని చెప్పాలి..

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఉప్పెన తర్వాత ఆ లెవెల్లో హిట్ అయిన సినిమా జాతిరత్నాలు అనే చెప్పాలి. క్రాక్ సినిమా తో ఆఫ్టర్ కోవిడ్ టాలీవుడ్ మళ్ళీ తన సత్తాని చాటుకుంది .. దాన్ని కొనసాగిస్తూ ఉప్పెన సినిమా ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదు . ఆ జోరును కొనసాగిస్తూ జాతిరత్నాలు సినిమాలు ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతూ వస్తుంది.. రిలీజ్ అయ్యి చాలారోజులవుతున్నా జాతిరత్నాలు హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. నవీన్ పోలిశెట్టి క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది. కలెక్షన్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. ప్రమోషన్స్ కూడా అంతేస్థాయిలో చేసుకుంటూ పోతోంది చిత్రయూనిట్. అలా జాతి రత్నాలు సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇది ఈ ఏడాదిలోనే అతి గొప్ప విషయం.

జాతి రత్నాలు ఈ రెండు వారాల్లో దాదాపు యాభై కోట్ల గ్రాస్‌కు చేరుకుంది. ఈ పద్నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతి రత్నాలు 49.15కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా 30.75 కోట్ల నెట్ షేర్‌ను వసూళ్లు చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో జాతి రత్నాలు తన సత్తా చాటింది.కరోనా వల్ల ఈ ఏడాది ఓవర్సీస్ మార్కెట్‌లో మన సినిమాలేవీ అంతగా ఆడటం లేదు. ఎందుకంటే అంతటా కరోనా భయం నెలకొని ఉంది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ కూడా అక్కడ వన్ మిలియన్ మార్క్‌ను చేరుకోలేకపోయింది. కానీ జాతి రత్నాలు మాత్రం ఆ ఫీట్‌ను అందుకుని చరిత్ర సృష్టించింది.ఈ ఏడాదిలో ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ను రాబట్టిన చిత్రంగా జాతి రత్నాలు నిలిచింది. ఈ లెక్కన ఉప్పెన సినిమాను కూడా జాతిరత్నాలు వెనక్కి నెట్టేసింది. మొట్టమొదటి వన్ మిలియన్ డాలర్ల చిత్రంగా జాతి రత్నాలు నిలవడంతో చిత్రయూనిట్ గాల్లో తేలిపోతోంది.


సిబిఐ మాజీ జేడితో కలిసి ఢిల్లీ వెళ్తున్న గంటా...?

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>