PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp1eb2dec9-9604-4d53-b7ee-c46bffc22032-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp1eb2dec9-9604-4d53-b7ee-c46bffc22032-415x250-IndiaHerald.jpgఏపీలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి కష్టాల్లో ఉందో అందరికీ తెలిసిందే. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ పరిస్తితి దిగజారిపోయింది. అసలే 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు ఘోరంగా ఓడిపోయిన టీడీపీ, తాజాగా జగన్ అద్భుతమైన పాలనకు ప్రజలు పట్టం కట్టడంతో, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.TDP;nani;raghu;telugu desam party;jagan;vijayawada;2019;mp;telugu;kesineni nani;parliment;cycle;cheque;konakalla narayana rao;tdp;ycp;buddha venkanna;research and analysis wing;partyవైసీపీకి ప్లస్ అవుతున్న టీడీపీ నేతలు....ఆ ఇద్దరు సైకిల్ తొక్కలేకపోతున్నారా?వైసీపీకి ప్లస్ అవుతున్న టీడీపీ నేతలు....ఆ ఇద్దరు సైకిల్ తొక్కలేకపోతున్నారా?TDP;nani;raghu;telugu desam party;jagan;vijayawada;2019;mp;telugu;kesineni nani;parliment;cycle;cheque;konakalla narayana rao;tdp;ycp;buddha venkanna;research and analysis wing;partySat, 27 Mar 2021 01:00:00 GMT

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి కష్టాల్లో ఉందో అందరికీ తెలిసిందే. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ పరిస్తితి దిగజారిపోయింది. అసలే 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు ఘోరంగా ఓడిపోయిన టీడీపీ, తాజాగా జగన్ అద్భుతమైన పాలనకు ప్రజలు పట్టం కట్టడంతో, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.


అయితే ఇలా వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న పార్టీ, కొందరు టీడీపీ నేతల వల్ల మరింత కష్టాల్లోకి వెళ్లిపోతుంది. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు వల్ల ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యంగా నాయకుల మధ్య లుకలుకల వల్ల గెలవాల్సిన విజయవాడ కార్పొరేషన్‌ని చేజార్చుకుంది. అసలు విజయవాడలో టీడీపీ బలంగానే ఉంది.


దీంతో కార్పొరేషన్‌లో పార్టీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్నల మధ్య ఉన్న గొడవలతో పార్టీ ఓటమి పాలైంది. నగరంలో కేశినేని వర్గం, బుద్దా వర్గాల మధ్య ఉన్న లుకలుకలు ఎన్నికల సమయంలోనే బయట పడటంతో, టీడీపీకి బాగానే డ్యామేజ్ జరిగింది. ఇదే సమయంలో అధికార వైసీపీ నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించుకున్నారు.


అయితే పార్టీలో ఇన్ని విభేదాలు ఉన్నా సరే చంద్రబాబు సరైన యాక్షన్ తీసుకోలేకపోయారు. ఏదో ఎన్నికల సమయంలో నాయకులని మందలించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పటికీ వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం సైతం పార్టీ విభేదాలకు చెక్ పెట్టలేకపోయారు. ఇటు మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ సైతం, తన పార్లమెంట్ పరిధిలో పార్టీని గెలిపించలేకపోయారు.


కృష్ణాలో ఈ ఇద్దరు నేతలు పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయలేకపోతున్నారు. అందుకే విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్‌ల్లో సైతం పార్టీ ఓటమి పాలవాల్సి వచ్చింది. మొత్తానికైతే పార్లమెంట్ అధ్యక్షులు సైకిల్‌ని సమర్ధవంతంగా తొక్కలేకపోతున్నారని తెలుస్తోంది.





హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>