Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli-80ae2575-8a27-421f-8572-8885f03225d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli-80ae2575-8a27-421f-8572-8885f03225d1-415x250-IndiaHerald.jpgభారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే టెస్ట్ టి20 సిరీస్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జరిగిన టెస్ట్ టి20 సిరీస్ లో భారత గడ్డపై అద్భుతంగా రాణించిన టీమిండియా ఘన విజయాలను అందుకున్నది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకుని ఇంగ్లాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేయాలనీ టీమిండియా ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇటీవలే వన్డే సిరీస్లో భాగంగా పూణే వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలోనే దూకుడు మీద ఉన్న టీమిండియాకు రెండో వన్డే మ్యాచ్లKohli;johnny;rahul new;rahul;rani;virat kohli;k l rahul;india;england;rishabh pant;rahul sipligunj;pune;johnny1;dookudu;paruguమాకు కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?మాకు కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?Kohli;johnny;rahul new;rahul;rani;virat kohli;k l rahul;india;england;rishabh pant;rahul sipligunj;pune;johnny1;dookudu;paruguSat, 27 Mar 2021 14:40:00 GMTభారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే టెస్ట్ టి20 సిరీస్ జరిగింది అన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే జరిగిన టెస్ట్ టి20 సిరీస్ లో భారత గడ్డపై అద్భుతంగా రాణించిన టీమిండియా ఘన విజయాలను అందుకున్నది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకుని ఇంగ్లాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేయాలనీ టీమిండియా ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇటీవలే వన్డే సిరీస్లో భాగంగా పూణే వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది.  ఈ క్రమంలోనే దూకుడు మీద ఉన్న టీమిండియాకు రెండో వన్డే మ్యాచ్లో మాత్రం బ్రేక్ పడింది.



రెండవ వన్డే మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి అద్భుతంగా రాణించింది అని చెప్పాలి.  బ్యాట్ మెన్స్ అందరూ కూడా చెలరేగి పోవడంతో ఇక టీమిండియా ఏకంగా మూడు వందల ముప్పై ఆరు పరుగులు చేసింది.  ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు గెలవడం కాస్త కష్టమే అనుకున్నారు అందరు. కానీ ఊహించని విధంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం పుంజుకున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ లో మొదట టీమిండియా బ్యాటింగ్ చేయగా  .. కేఎల్ రాహుల్ (108: 114 బంతుల్లో 7x4, 2x6) సెంచరీ బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు రిషబ్ పంత్ (77: 40 బంతుల్లో 3x4, 7x6), విరాట్ కోహ్లీ (66: 79 బంతుల్లో 3x4, 1x6) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అనంతరం ఛేదనలో జానీ బెయిర్‌స్టో (124: 112 బంతుల్లో 11x4, 7x6), బెన్‌స్టోక్స్ (99: 52 బంతుల్లో 4x4, 10x6) దూకుడుగా ఆడేయడంతో ఇంగ్లాండ్ టీమ్‌ అలవోకగా 43.3 ఓవర్లలోనే 337/4తో విజయాన్ని అందుకుంది.



 అయితే రెండో వన్డే మ్యాచ్లో ఓటమి పై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ముఖ్యంగా బెన్ స్టోక్ బెయిర్ స్ట్రో జోడి గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..  తన కెరియర్ లో  చూసిన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన లో ఇది ఒకటి.  స్టోక్ బెయిర్ స్ట్రో తమ విధ్వంసకర హిట్టింగ్ తో టీమిండియాను నిస్సహాయ స్థితిలో పడేశారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యం మాకు కనీసం పుంజుకునే అవకాశం కూడా ఇవ్వలేకపోయింది అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.  ఇక తర్వాత మ్యాచ్ లో మళ్లీ పుంజుకుని విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంటామని అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ.



పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>