WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/amma-do-pregnant-women-follow-these-precautions325505a7-857d-445a-be93-3ecc5411897c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/amma-do-pregnant-women-follow-these-precautions325505a7-857d-445a-be93-3ecc5411897c-415x250-IndiaHerald.jpgబిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళల ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇక పుట్టే బిడ్డపై కోటి ఆశలు పెంచుకుంటారు. అంతటి ప్రాధాన్యం గల ఆ టైంలో చాలా కేర్‌ పుల్‌గా ఉండాలి. ఏది బడితే అది చేయకూడదు. ఏది బడితే అది తినకూడదు. ప్రతి క్షణం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. pregnant;koti;raaga;kanna lakshminarayana;iron;beetrootఅమ్మ: గర్భిణులు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..!?అమ్మ: గర్భిణులు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..!?pregnant;koti;raaga;kanna lakshminarayana;iron;beetrootSat, 27 Mar 2021 15:00:00 GMTకోటి ఆశలు పెంచుకుంటారు. అంతటి ప్రాధాన్యం గల ఆ టైంలో చాలా కేర్‌ పుల్‌గా ఉండాలి. ఏది బడితే అది చేయకూడదు. ఏది బడితే అది తినకూడదు. ప్రతి క్షణం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషకాలు ఉన్న ఫుడ్‌ని తీసుకోవాలి.పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలను కచ్చితంగా పాటించాలి.

ఎందుకంటే గర్భం దాల్చిన మరుక్షణమే ఒక్కరు కాదు ఇద్దరు. అప్పుడు తీసుకునే ప్రతి ఒక్కటీ కడుపులో ఉండే బిడ్డకు కూడా అందుతుంది. తిండి మీద ఏ మాత్రం అశ్రద్ధ వహించినా లోపల బిడ్డపై ప్రభావం పడుతుంది. తల్లీ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ఇందులో ఎక్కువ మోతాదులో పొటాషియం, లవణాలు ఉంటాయి.

అలాగే మాసాహారం, గుడ్లు తినొచ్చు. ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే బీట్‌రూట్, క్యారెట్ తినడం చాలా మంచిది. బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు క్యారెట్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి.పండ్లు, కూరగాయలతో పాటు పాలు, మాంసం, గుడ్లు, చేపలు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. గర్భిణీల్లో రక్తహీనత ఉంటే తల్లీకి అధిక రక్తస్రావం జరుగుతుంది. బిడ్డ తక్కువ బరువుతో పుడతారు. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, బెల్లం, రాగులు, కర్జూరం, ద్రాక్ష, నువ్వులు, చెరకు రసం, ఉలవలు తీసుకోవాలి.

ప్రెగ్నెన్సీ సమంయలో జున్ను తినడం కూడా మంచిదే. ఇందులో అధిక కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అజీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు మిరియాలను కలుపుకుని తినాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుని వారి సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తగిన ఆహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో చూశారుగా. ఇలాంటి సమస్యల గురించి ఎవరికీ తెలియదు. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి.


శేఖర్ కమ్ముల బోల్డ్ అటెంప్ట్...జనానికి ఎక్కుతుందా ?

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>