MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/reason-behind-aranya-movie-bad-talk4de0a437-bbff-4761-bd61-24c885802cd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/reason-behind-aranya-movie-bad-talk4de0a437-bbff-4761-bd61-24c885802cd3-415x250-IndiaHerald.jpgవిడుదలైన తొలిరోజే అరణ్య సినిమాపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు కొంతమంది. గ్రాఫిక్స్ బాగోలేవని, నేరేషన్ సరిగా లేదని కామెంట్లు విసిరారు. అయితే రానా నటనకు మాత్రం వంక పెట్టలేమని చెప్పేశారు. ఎన్ని చెప్పినా.. సినిమాపై బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయ్యే సరికి జనంలో కూడా ఆసక్తి తగ్గిపోయింది. అందులోనూ అరణ్య మూవీకి ఇతర కమర్షియల్ హంగులేవీ లేవని ముందుగానే తేలిపోవడంతో యూత్ ఆ సినిమాకి ఎక్కువగా అట్రాక్ట్ కాలేదని, అందుకే ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో లేవని అంటున్నారు. aranya, rana, daggubati rana, aranya movie;review;rana;suresh;vishal krishna;cinema;telugu;hindi;graphics;heroఅరణ్యపై బ్యాడ్ టాక్.. అసలేం జరిగింది..?అరణ్యపై బ్యాడ్ టాక్.. అసలేం జరిగింది..?aranya, rana, daggubati rana, aranya movie;review;rana;suresh;vishal krishna;cinema;telugu;hindi;graphics;heroSat, 27 Mar 2021 11:00:00 GMTగ్రాఫిక్స్ బాగోలేవని, నేరేషన్ సరిగా లేదని కామెంట్లు విసిరారు. అయితే రానా నటనకు మాత్రం వంక పెట్టలేమని చెప్పేశారు. ఎన్ని చెప్పినా.. సినిమాపై బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయ్యే సరికి జనంలో కూడా ఆసక్తి తగ్గిపోయింది. అందులోనూ అరణ్య మూవీకి ఇతర కమర్షియల్ హంగులేవీ లేవని ముందుగానే తేలిపోవడంతో యూత్ ఆ సినిమాకి ఎక్కువగా అట్రాక్ట్ కాలేదని, అందుకే ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో లేవని అంటున్నారు.

అరణ్యకు అరగంట కత్తెర వేశారా..?
2.45 గంటల నిడివి ఉన్న అరణ్య సినిమాని నిర్మాతలే దాదాపు అరగంట కట్ చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. చూడటానికి డాక్యుమెంటరీలాగా ఉందని, అందుకే సురేష్ బాబు, రానా కలసి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. నిడివి తక్కువగా ఉన్నా కూడా అరణ్య బోరింగేనంటూ వచ్చిన రివ్యూలు డిజప్పాయింట్ చేస్తున్నాయి. మరో హీరో విష్ణు విశాల్ కనిపించే సన్నివేశాల విషయంలో దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోలేదని అందుకే సినిమాపై బ్యాడ్ టాక్ మొదలైందని తెలుస్తోంది.

ప్రచారం అనుకున్నట్టు జరగలేదా..?
రానా సినిమా విడుదల సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలిపారు కానీ, సినిమా ముందుగా చూసిన ఏ ఒక్కరూ దాని గురించి మాట్లాడలేకపోయారట. ముందుగానే ఈ సినిమాని కొంతమంది ప్రముఖులకు చూపించి, వారి ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాలనుకున్నారట. కానీ అలా సినిమా చూసినవారెవరూ అరణ్య గురించి తమ కామెంట్లు పెట్టకపోవడం విచిత్రం.

రానా కష్టం వృథా అయిందా..?
అరణ్య సినిమాపై రానా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొత్త గెటప్ కోసం బాగా కష్టపడ్డాడు. అయినా కూడా ఫలితం లేదని, ఆ స్థాయిలో సినిమా జనాలకు రీచ్ కాలేదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు హిందీ వెర్షన్ హాథీ మేరీ సాథీ కూడా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తెలుగులో బ్యాడ్ టాక్ మొదలైన తర్వాత హిందీలో విడుదలైనా పెద్దగా ఉపయోగం ఉంటుందని ఎవరూ అనుకోరు. అంటే హిందీ వెర్షన్ పై ఆల్రడీ అక్కడి నిర్మాతలు ఆశలు వదిలేసుకున్నట్టే లెక్క.




మరో పోరుకు జగన్ రెడీ...?

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>