Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/politics_latestnews/kuppintaku81c1455f-5c88-4b4d-919d-03d4cca1c05e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/politics_latestnews/kuppintaku81c1455f-5c88-4b4d-919d-03d4cca1c05e-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం ఆయుర్వేదంలో ఎన్ని రకాల వనమూలికలను ఉపయోగిస్తూ ఎన్నో రకాల వ్యాధులను నియంత్రిస్తున్నాము. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఇలాంటి వనమూలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ విధమైనటువంటి వనమూలికలలో కుప్పింటాకు ఒకటి. ఈ కుప్పింటాకు ప్రతి ఒక్క భాగంలోనూ ఎన్నో ఔషధగుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకు ద్వారా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కుప్పింటాకు ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.... kuppintaku;soundarya;aqua;ayurvedaకుప్పింటాకు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..?కుప్పింటాకు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..?kuppintaku;soundarya;aqua;ayurvedaSat, 27 Mar 2021 09:00:00 GMTఈ కుప్పింటాకు ప్రతి ఒక్క భాగంలోనూ ఎన్నో ఔషధగుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకు ద్వారా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కుప్పింటాకు ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం....                                                 

దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారికి కుప్పింటాకు టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆకుల ద్వారా తయారు చేసుకున్న టి ఒక కప్పు తాగటం వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి పొందటమే కాకుండా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని కూడా అందిస్తుంది. అదేవిధంగా ఏదైనా గాయం తగిలినప్పుడు ఈ కుప్పింటాకును మెత్తగా రుబ్బి అందులో కొద్దిగా పసుపు కలిపి గాయమైన చోట రాయటం వల్ల గాయం తొందరగా మానవుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడే వారికి ఈ కుప్పింటాకు ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.

అధిక కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ కుప్పింటాకు మిశ్రమాన్ని కాస్త కొబ్బరినూనెలో తక్కువ మంట వద్ద వేడి చేసుకుని శరీరం మొత్తం రాసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడే నొప్పులు తొలగిపోతాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగటం వల్ల మన కడుపు లో ఉన్నటువంటి నులిపురుగులు బయటకు తొలగించడమే కాకుండా కడుపు నొప్పి సమస్య నుంచి విముక్తిని కల్పిస్తుంది. అదేవిధంగా ఈ ఆకుల మిశ్రమాన్ని బాగా నూరిఅందులో కొద్దిగా పసుపు కలిపి ముఖంపై రాసుకోవడం వల్ల ముఖం పై ఏర్పడిన మొటిమలు మచ్చలు కూడా తొలిగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. ఈ కుప్పింటాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.


మా ఫ్యామిలీ ని తొక్కేయాలని చూస్తున్నారు.. సాయి ధరమ్ తేజ్ వార్నింగ్..!!

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>