MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dulqar-salman-movie-update64a0f989-f853-4d6d-9300-86a234e1d4fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dulqar-salman-movie-update64a0f989-f853-4d6d-9300-86a234e1d4fa-415x250-IndiaHerald.jpgఎంతో నటనా ప్రతిభ కలిగిన మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా తన సత్తా ఏమిటో నిరూపించుకుంటున్నాడు. ఇప్పటీకే అన్ని బాషలలో సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. తన ముందుకు వచ్చిన కథలన్నింటినీ ఒప్పుకోకుండా, నటనా ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. DULQAR SALMAN MOVIE UPDATE;mammootty;salman khan;dulquer salmaan;indrajith;jeevitha rajaseskhar;rajendran;kerala;india;cinema;rajani kanth;vegetable market;heroine;success;mahanati;criminalదుల్కర్ సల్మాన్ ...ఒక క్రిమినల్ కథతో...?దుల్కర్ సల్మాన్ ...ఒక క్రిమినల్ కథతో...?DULQAR SALMAN MOVIE UPDATE;mammootty;salman khan;dulquer salmaan;indrajith;jeevitha rajaseskhar;rajendran;kerala;india;cinema;rajani kanth;vegetable market;heroine;success;mahanati;criminalSat, 27 Mar 2021 14:02:40 GMT" style="height: 370px;">
ఎంతో నటనా ప్రతిభ కలిగిన మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా తన సత్తా ఏమిటో నిరూపించుకుంటున్నాడు. ఇప్పటీకే అన్ని బాషలలో సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. తన ముందుకు వచ్చిన కథలన్నింటినీ ఒప్పుకోకుండా, నటనా ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు.  తెలుగు ఇండస్ట్రీలో సైతం దుల్కర్ కి అభిమానులు భారీగానే ఉన్నారు. ఇతను ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలతో పరిచయమయ్యాడు. అయితే ఈ వరుసలో తాను చేసిన మహానటి సినిమాతో తన క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఇందులో తన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

సినిమా తరువాత గతేడాది కనులు కనులను దోచాయంటే అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.  ప్రస్తుతం దుల్కర్ పెద్ద ప్లాన్ తోనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోనున్నాడు. శ్రీనాధ్ రాజేంద్రన్ దర్శకత్వంలో కురుప్ అనే సినిమాను చేస్తున్నాడు. స్వయంగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నాడు.  తాజాగా చిత్ర బృందం 'కురుప్' తెలుగు టీజర్ ను విడుదల చేసింది.

ఈ టీజర్ లో దుల్కర్ పలికిన సంభాషణలు ఇలా ఉన్నాయి..'36 సంవత్సరాలు.. మూడు వందలకు పైగా టిఫాప్స్.. వెయ్యికి పైగా ప్రయాణాలు.. ఇదంతా ఒకరి కోసం..' ప్రేక్షకులకు మజా అందిచింది . ఈ సినిమా 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన భారతదేశంలోనే ఎక్కువ కాలం వెతకబడిన సుకుమార కురుప్ అనే క్రిమినల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మన తెలుగు ఆడపడుచు శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను అతి త్వరలోనే అన్ని భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఏ సినిమా కనుక హిట్ అయితే, దుల్కర్ సల్మాన్ మార్కెట్ మరింత పెరుగుతుంది.


బండి నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్నారా.. ఇక కోర్టుకు వెళ్లాల్సిందే..?

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>