PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan1f7f143f-6ee6-44c0-8a4e-94718ed1ca46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan1f7f143f-6ee6-44c0-8a4e-94718ed1ca46-415x250-IndiaHerald.jpgతాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్త చర్చ సాగుతోంది. ఏపీలో అధికారికంగా ఒక్కరే ముఖ్యమంత్రి ఉన్నా.. అనధికారికంగా ముగ్గురు ముఖ్యమంత్రులున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకరేమో రాజకీయ ముఖ్యమంత్రి, మరొకరు అధికారులకు ముఖ్యమంత్రి, ఇంకొకరేమో సచివాలయ అధికారులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఉన్నారనే చర్చ జరుగుతోంది.ap cm jagan;praveen;jagan;andhra pradesh;deputy chief minister;cm;chief minister;grama sachivalayamఏపీలో ముగ్గురు ముఖ్యమంత్రులట!ఏపీలో ముగ్గురు ముఖ్యమంత్రులట!ap cm jagan;praveen;jagan;andhra pradesh;deputy chief minister;cm;chief minister;grama sachivalayamSat, 27 Mar 2021 20:41:27 GMTఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్త చర్చ సాగుతోంది. ఏపీలో అధికారికంగా ఒక్కరే ముఖ్యమంత్రి ఉన్నా.. అనధికారికంగా ముగ్గురు ముఖ్యమంత్రులున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకరేమో రాజకీయ ముఖ్యమంత్రి, మరొకరు అధికారులకు ముఖ్యమంత్రి, ఇంకొకరేమో సచివాలయ అధికారులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఉన్నారనే చర్చ జరుగుతోంది.

సిఎంవో కార్యాలయ ఇంఛార్జి అధికారి ప్రవీణ్‍ ప్రకాష్‍ను తమ ముఖ్యమంత్రిగా ఐఎఎస్‍ అధికారులు చెప్పుకుంటున్నారట. ఐఏఎస్ లకు సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదట. ముఖ్యమంత్రిని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా.. వీలు కాకపోవడంతో వారంతా ఇక ఆ ప్రయత్నాలే చేయడం మానుకున్నారట. సీఎంవో ఇంచార్జ్ ప్రవీణ్‍ ప్రకాష్‍ను కలిసి తమ అభిప్రాయాలు చెప్పుకుంటున్నారట. తమ శాఖపరమైన అంశాలను కూడా ఆయనతోనే చర్చిస్తున్నారట. ప్రవీణ్ ప్రకాశ్ ను కలిస్తే ముఖ్యమంత్రిని కలిసినట్టేనన్న భావనలో ఐఏఎస్ లు ఉన్నారంటున్నారు. అందుకే ఐఏఎస్ లకు ప్రవీణ్ ప్రకాషే ముఖ్యమంత్రి అన్న చర్చ సచివాలయంలో జరుగుతోంది. సచివాలయ అధికారులు, ఉద్యోగులకు...  సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి అని పలువురు చెబుతున్నారు. సచివాలయంలో బదిలీలు, పోస్టింగ్‍లన్నీ వెంకటరామిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. ప్రాధాన్యత కీలక శాఖలలో పోస్టులు కావాలన్నా ఎవరినైనా బదిలీ చేయాలన్నా వెంకటరామిరెడ్డిని స్వయంగా కలిస్తే.. ఆగమేఘాలపై బదిలీలు జరుగుతాయట. పోస్టింగ్‍లు కూడా ఇస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు.అందుకే సచివాలయంలో ఆయన సూపర్ బాస్ లో మారారనే చర్చ సాగుతోంది.

ప్రవీణ్‍ ప్రకాష్‍, వెంకటరామిరెడ్డిని కలిస్తే.. పనులు చక్కపెట్టుకోవచ్చని ఐఎఎస్‍ అధికారులతో పాటు సచివాలయ క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు నమ్ముతున్నారట. ఈ విషయాలన్నీ అసలు ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డికి తెలుసో తెలియదో  అని  సచివాలయంలో  టాక్. ఈ విషయాలు త్వరలో సిఎం జగన్‍ దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్దమవుతోందని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో బాగా పరిచయం ఉన్న అధికారులు అసలు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాల సమాచారం.  


ప్చ్ ... పాపం..... సీత పాత్ర కోసం తెగ కష్టపడుతోందట .... ??

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>