PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpg బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డం... బాగా ప్ర‌చారం చేయ‌డం.. అనే రెండు మౌలిక అంశాల‌పై టీఆర్ ఎస్ పార్టీ నాగార్జున సాగ‌ర్‌లో ఫోక‌స్ పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌చార జోరు పెంచేసిన అధికార పార్టీ.. అభ్య‌ర్థి విష‌యంలో మాత్రం స‌స్పెన్స్ కంటిన్యూ చేస్తోంది. గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిని బ‌రిలోకి దించాల‌ని యోచిస్తోంది. గుత్తాను బ‌రిలోకి దించితేనే జానారెడ్డిని క‌ట్ట‌డి చేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారంట‌. అందుకే బ‌ల‌మైన అభ్య‌ర్థిగా గుత్తానే అని కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతున్నారంట‌. ఇక రెkcr;kcr;nagarjuna akkineni;nagarjuna sagar dam;sathyavathi rathod;district;minister;party;mantraనాగార్జున సాగ‌ర్‌పై టీఆర్ ఎస్ గెలుపు వ్యూహం.... స్కెచ్ గీసేసిన కేసీఆర్‌నాగార్జున సాగ‌ర్‌పై టీఆర్ ఎస్ గెలుపు వ్యూహం.... స్కెచ్ గీసేసిన కేసీఆర్‌kcr;kcr;nagarjuna akkineni;nagarjuna sagar dam;sathyavathi rathod;district;minister;party;mantraSat, 27 Mar 2021 08:41:41 GMT


బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డం... బాగా ప్ర‌చారం చేయ‌డం.. అనే రెండు మౌలిక అంశాల‌పై టీఆర్ ఎస్ పార్టీ నాగార్జున సాగ‌ర్‌లో ఫోక‌స్ పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌చార జోరు పెంచేసిన అధికార పార్టీ.. అభ్య‌ర్థి విష‌యంలో మాత్రం స‌స్పెన్స్ కంటిన్యూ చేస్తోంది. గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిని బ‌రిలోకి దించాల‌ని యోచిస్తోంది. గుత్తాను బ‌రిలోకి దించితేనే జానారెడ్డిని క‌ట్ట‌డి చేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని  కేసీఆర్ భావిస్తున్నారంట‌. అందుకే బ‌ల‌మైన అభ్య‌ర్థిగా గుత్తానే అని కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతున్నారంట‌. ఇక రెండో విష‌యానికి వ‌స్తే బాగా ప్ర‌చారం చేయ‌డం. అందులో భాగంగానే ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. అందుకే ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తీ మండ‌లానికి మంత్రికి ఇన్చార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం.


నాగార్జునసాగర్‌లో ఉన్న ఏడూ మండలాలకు ఏడుగురు మంత్రులను నియమించారు. హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావులకు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరికి సీఎం కేసీఆర్ సాగర్ బాధ్యతలను వారి భుజాలపై మోపారు. సాగర్‌లో బీసీలు ఎక్కువగా ఉన్నందున ఆ సామాజికవర్గాన్ని ఎక్కువగా ఆకర్షించేందుకు మంత్రి తలసానికి ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు. లక్షకు పైగా ఉన్న యాదవులను టీఆర్‌ఎస్ వైపు తిప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇప్పటికే ఓటర్ నాడీ తెలుసుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు.


 నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 27, 28, 29 తేదీలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు అవకాశం ఉండదు. 30వ తేదీనే ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్‌ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు.







ఏపీలో రివర్స్ పాలన అన్న కేసీఆర్

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>