PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ratna-prabha-pawan-kalyan-tirupati-bypolle1cccbee-dae6-4f71-bbed-b338a8ed802f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ratna-prabha-pawan-kalyan-tirupati-bypolle1cccbee-dae6-4f71-bbed-b338a8ed802f-415x250-IndiaHerald.jpgతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె అభ్యర్థిత్వం వెనక పవన్ కల్యాణ్ కసరత్తు బాగానే ఉందని తెలుస్తోంది. కర్నాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రత్నప్రభ 2019లో బీజేపీలో చేరారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఆమెను జనసేనలో చేర్చుకుని, గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయించాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉండేది. ఆమేరకు మంతనాలు కూడా జరిగాయని సమాచారం. అయితే చివరి నిముషంలో బీజేపీ, పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెచ్చింది. తిరుపతిలో బీజేపీ తరపున అభ్యర్థి ratna prabha, pawan kalyan, tirupati bypoll;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;tirupati;parliment;karnataka 1;minister;doctor;husband;tdp;central government;ycp;janasena party;yatra;partyరత్నప్రభ... కేరాఫ్ పవన్ కల్యాణ్రత్నప్రభ... కేరాఫ్ పవన్ కల్యాణ్ratna prabha, pawan kalyan, tirupati bypoll;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;tirupati;parliment;karnataka 1;minister;doctor;husband;tdp;central government;ycp;janasena party;yatra;partyFri, 26 Mar 2021 07:00:00 GMTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె అభ్యర్థిత్వం వెనక పవన్ కల్యాణ్ కసరత్తు బాగానే ఉందని తెలుస్తోంది. కర్నాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రత్నప్రభ 2019లో బీజేపీలో చేరారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఆమెను జనసేనలో చేర్చుకుని, గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయించాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉండేది. ఆమేరకు మంతనాలు కూడా జరిగాయని సమాచారం. అయితే చివరి నిముషంలో బీజేపీ, పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెచ్చింది. తిరుపతిలో బీజేపీ తరపున అభ్యర్థి బరిలో దిగాలని, అప్పుడే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని జనసేనానిని ఒప్పించింది. అభ్యర్థి విషయంలో పవన్ సలహాలు స్వీకరిస్తామని చెప్పిన బీజేపీ అధిష్టానం రత్నప్రభవైపు మొగ్గు చూపింది.

జనసేన పూర్తి మద్దతు..
రత్న ప్రభ కాకుండా మరో అభ్యర్థి పేరు ఖరారు చేస్తే.. జనసైనికులు డిజప్పాయింట్ అయ్యేవారేమో. కానీ బీజేపీ మాత్రం రత్నప్రభ పేరు ఫైనల్ చేసి అటు జనసేన ఓట్లు బయటకు పోకుండా కాపాడుకుంది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ తిరుపతి ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. అధికార వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మితో ఆమె పోటీపడబోతున్నారు.

పవన్ కల్యాణ్ పైనే భారమంతా..?
తిరుపతి ఉప ఎన్నికల భారమంతా పవన్ కల్యాణ్ పైనే పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అభ్యర్థి ఖరారు కాలేదు కాబట్టి.. పవన్ ఎక్కడా బయటకు రాలేదు. గతంలో జనసేన తరపున తిరుపతి పార్లమెంట్ పరిధిలో పార్టీ ఎంత పటిష్టంగా ఉందో తెలుసుకునేందుకు మాత్రమే ఆయన యాత్ర చేపట్టారు. ఆ తర్వాత జనంలోకి రాలేదు జనసేనాని. మళ్లీ ఇప్పుడు రత్నప్రభ ప్రచార పర్వంలో ఆయన కనపడతారని అంటున్నారు. బీజేపీ అధిష్టానం కూడా తిరుపతి ఎన్నికల్లో రత్నప్రభను గెలిపించే బాధ్యతను పవన్ కల్యాణ్ పై పెట్టిందని అంటున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న వకీల్ సాబ్ కూడా.. ప్రత్యేకంగా కొన్ని రోజులు ప్రచారానికి కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. 


సాగ‌ర్‌లో వాళ్లే జానారెడ్డికి మైన‌స్ కానున్నారా..?

హెరాల్డ్ స్మ‌రామీ : నిబ‌ద్ధ‌త‌తో సినిమాల‌ను నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావు

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ రాజుగారికి జనసేనతో తలనొప్పే...

తన బావమరిది సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అభ్యర్ధితోనే బీజేపీ సీన్ ఏమిటో అర్ధమైపోయిందా ?

రాజమౌళి సినిమాలలో కనిపించే ఈ కామన్ పాయింట్స్ ను ఎప్పుడైనా గుర్తించారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>