Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/kevin-petersen-said-that-he-will-be-happy-if-india-and-pakistan-come-together-again763a51f1-389d-4701-9969-820bb2fb9e1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/kevin-petersen-said-that-he-will-be-happy-if-india-and-pakistan-come-together-again763a51f1-389d-4701-9969-820bb2fb9e1a-415x250-IndiaHerald.jpgఇండియా, పాకిస్తాన్ దేశాలు సరిహద్దు వద్దే కాదు.. క్రికెట్ మైదానంలో కూడా శతృవుల్లానే పోరాడుతారు. విజయం కోసం చెమటోడుస్తారు. క్రికెట్ ప్రేక్షకులు కూడా ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటూ చిన్న సైజు యుద్ధంలా ఫీల్ అవుతారు. అయితే ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా సంబంధాలు దెబ్బతినడంతో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లూ జరగడం లేదు. కానీ, తాజాగా పరిణామాలు చూస్తుంటే..india vs pakistan;imran khan;santoshi;shatru;tara;cricket;india;pakistan;narendra modi;prime minister;twitter;war;icc t20;nijam;narendra‘ఇండియా-పాక్ కలిస్తే చూడాలనుంది.. అది జరిగితే నా కల నెరవేరినట్లే..’‘ఇండియా-పాక్ కలిస్తే చూడాలనుంది.. అది జరిగితే నా కల నెరవేరినట్లే..’india vs pakistan;imran khan;santoshi;shatru;tara;cricket;india;pakistan;narendra modi;prime minister;twitter;war;icc t20;nijam;narendraFri, 26 Mar 2021 10:05:00 GMTఇంటర్నెట్ డెస్క్: ఇండియా, పాకిస్తాన్ దేశాలు సరిహద్దు వద్దే కాదు.. క్రికెట్ మైదానంలో కూడా శతృవుల్లానే పోరాడుతారు. విజయం కోసం చెమటోడుస్తారు. క్రికెట్ ప్రేక్షకులు కూడా ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటూ చిన్న సైజు యుద్ధంలా ఫీల్ అవుతారు. అయితే ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా సంబంధాలు దెబ్బతినడంతో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లూ జరగడం లేదు. కానీ, తాజాగా పరిణామాలు చూస్తుంటే మళ్లీ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు, కెప్టెన్ కెవిన్ పీటర్సన్ టీమిండియా, పాకిస్తాన్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ ఒక్కటైతే తనకంటే సంతోషించే క్రికెటర్ మరొకరు ఉండరని అన్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.

‘భారత్-పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడితే నాకంటే సంతోషించేవారు మరొకరుండరు. ఇరు దేశాలూ కలిస్తే నా కల నెరవేరినట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకరికొకరు అండగా ఉండటం చాలా అవసరం. అది ఈ ఏడాది ప్రతి ఒక్కరికి తెలుసొచ్చింది’ అని కెవిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఓ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన కెవిన్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉంటే మోదీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కెవిన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాక్ ఇండియాకు వచ్చే అవకాశం ఉండడం, అలాగే ఇరు జట్ల మధ్య ఓ టీ20టోర్నీ కూడా జరిగే అవకాశం ఉందని పాక్ మీడియాలో వరుస కథనాలు ప్రసారం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో కెవిన్ ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. నిజంగానే దాయాది దేశాలు మళ్లీ ఒక్కటై క్రికెట్ ఆడతాయేమోనని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. కాగా ఈ పరిణామాల నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లు కూడా ఆడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

" style="height: 492px;">




సాగర్ బీజేపీఅభ్యర్ధి ఫైనల్...?

ఈ లాంగ్ వీకెండ్ విజేత ఎవరు కానున్నారో...?

షర్మిల ముందు జాగ్రత్త.. అనుచరులకు వార్నింగ్..

జగన్ చెప్పినా వీళ్ళకు లేక్కలేదా...?

కొర‌క‌రాని కొయ్య‌లా సీత‌క్క‌.... కేసీఆర్‌తో స‌హా అంద‌రిని ఏకి ప‌డేస్తోందిగా...!

ఇలా అయితే.. జ‌గ‌న్-సాయిరెడ్డిల‌ను న‌మ్మెదెవ‌రు... ఢిల్లీలో ప‌రువు పోయిందా ?

ఆ హీరో సినిమాలో అతిధి పాత్రలో సందడి చేయనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>