ViralHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/50-years-old-male-biker-posts-photos-like-a-girl7be5ece6-9901-4f74-a7d6-8cc4342b9524-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/50-years-old-male-biker-posts-photos-like-a-girl7be5ece6-9901-4f74-a7d6-8cc4342b9524-415x250-IndiaHerald.jpgఇంటర్నెట్ డెస్క్: ‘నా కళ్లు నన్ను మోసం చేయవు’ అని మీలో ఎవరైనా అనుకుంటే వెంటనే ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూసి, అసలు విషయం తెలుసుకున్న తరువాత మీ అభిప్రాయం మార్చుకుంటారు. ‘నిజంగా నా కళ్లు నన్ను మోసం చేశాయి’ అని మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ ఫోటోలో స్ప్రోర్ట్స్ బైక్‌ల పక్కన కనిపిస్తున్న అమ్మాయి అలాంటిది మరి. సముద్రం ఒడ్డున స్పోర్ట్స్ బైక్ పార్క్ చేసి, దాని పక్కనే నిలబడి సెల్ఫీ దిగుతున్న ఓ అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె తన ఖాతాలో తరచుగా తన బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫోbiker; photoshop;women;sports;japan;media;twitter;bike;heart;woman;girl;march;nijamఈ మహిళ 50 ఏళ్ల మగాడట.. మామూలుగా లేదుగా ట్విస్ట్ఈ మహిళ 50 ఏళ్ల మగాడట.. మామూలుగా లేదుగా ట్విస్ట్biker; photoshop;women;sports;japan;media;twitter;bike;heart;woman;girl;march;nijamFri, 26 Mar 2021 10:44:47 GMTఇంటర్నెట్ డెస్క్: ‘నా కళ్లు నన్ను మోసం చేయవు’ అని మీలో ఎవరైనా అనుకుంటే వెంటనే ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూసి, అసలు విషయం తెలుసుకున్న తరువాత మీ అభిప్రాయం మార్చుకుంటారు. ‘నిజంగా నా కళ్లు నన్ను మోసం చేశాయి’ అని మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ ఫోటోలో స్ప్రోర్ట్స్ బైక్‌ల పక్కన కనిపిస్తున్న అమ్మాయి అలాంటిది మరి. సముద్రం ఒడ్డున స్పోర్ట్స్ బైక్ పార్క్ చేసి, దాని పక్కనే నిలబడి సెల్ఫీ దిగుతున్న ఓ అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె తన ఖాతాలో తరచుగా తన బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతంగా యువకుల ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే తాజాగా ఆమె గురించిన ఓ షాకింగ్ నిజం బయటపడడంతో వారి గుండె ఆగినంత పనైంది. ఇంతకీ ఆ నిజం ఏంటో తెలుసా..? ఇన్నాళ్లు వాళ్లంతా అమ్మాయి అనుకుని ఫాలో అవుతున్న బైకర్ అమ్మాయి కాదు. ఏకంగా 50 ఏళ్ల పురుషుడు. ఈ విషయం తెలియడంతో అనేకమందికి దిమ్మతిరిగిపోయింది.

అజుసగకుయుకి అనే ట్విటర్ ఖాతాలో లేడీ మోటార్ బైక్ రైడర్‌‌గా ఓ జపనీస్ యువతి తెగ పాపులర్. అయితే తాజాగా ఆమె బైక్ ముందు నిల్చుని ఉన్న ఫోటోలో ఏదో తేడా తెలియడంతో నెటిజన్లు ఆ ఫోటోను తీక్షణంగా పరిశీలించారు. అంతే.. దిమ్మతిరిగే వాస్తవం వారికి తెలిసొచ్చింది. బైక్ ఆమె అమ్మాయిలా కనిపించా.. రియర్ వ్యూ మిర్రర్‌లో అతడిగా దొరికిపోయాడు. ఈ ఫొటో కాస్తా వైరల్ అవడంతో జపాన్ మీడియా అవుట్‌లెట్లు అన్నీ కదిలాయి. ఆ బైకర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని నడుంబిగించాయి. జపాన్ వెరైటీ షో సిబ్బంది ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. అతడి వయసు 50 ఏళ్లు.

దీనిపై అతడు స్పందించాడు. సోషల్ మీడియాలో ఎవరూ అంకుల్‌లా ఉండాలని భావించరని, అందుకే తన ఫొటోను ఇలా అమ్మాయిలా మార్చి పోస్టులు పెడుతుండేవాడినని వెల్లడించాడు. సరదా కోసమే అలా చేశాను తప్ప ఎవరినీ మోసగించేందుకు కాదని చెప్పాడు. తాను మహిళగా ఫొటో పెట్టిన వెంటనే 1000 మంది ఫాలోవర్లు వచ్చి చేరారని, దీంతో దానిని అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నానని, ఆన్‌లైన్ సెలబ్రిటీగా ఫీలవుతూ వచ్చానని పేర్కొన్నాడు. తాను అమ్మాయిలా కనపడేందుకు ఫేస్‌యాప్‌, ఫొటోషాప్‌లను ఉపయోగించేవాడనని అతడు తెలిపాడు. అయితే దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా జోకులు పేలుతున్నాయి. ‘మీకేం అలా మార్ఫింగ్ చేసి ఫోటోలు పెడతారు. వాటిని చూసి మతి పోగొట్టుకునే మాలాంటి పురుషుల సంగతేంటి..?’ అంటూ కొందరు యువత చమత్కరిస్తున్నారు.


 
">

Powered by Froala Editor




ఈ మహిళ 50 ఏళ్ల మగాడట.. ట్విస్ట్ మామూలుగా లేదుగా

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?

అనసూయ బుల్లితెరకు దూరమవుతోందా..?

ఆ హీరోయిన్ కారణంగా.. మా బతుకే బస్టాండ్ అంటున్న నితిన్ టీం..!

సాగ‌ర్‌లో కేసీఆర్‌కు జ‌గ‌న్ మార్క్ షాక్‌... ఊహించ‌ని దెబ్బ‌తో మైండ్ బ్లాక్ ?

బాబు... ఓన్లీ డైరెక్షన్..?

బిజెపి నేత కోసం టీడీపీ వాళ్ళను ఇబ్బంది పెడుతున్న బాబు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>