PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/surabhi-vanidevi2d559e06-6fdd-4e3c-b384-07ad67ae9d45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/surabhi-vanidevi2d559e06-6fdd-4e3c-b384-07ad67ae9d45-415x250-IndiaHerald.jpgవాణిదేవీకి ఏ పదవి కట్టాబెట్టాలన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. కేబినెట్ బెర్త్ కాకుండా వాణిదేవీకి శాసనమండలి చైర్మెన్ పదవి ఇవ్వాలని సూచన కొందరు నేతలు చేశారంటున్నారు.దీంతో వాణిదేవీకి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.surabhi vanidevi;kcr;hyderabad;telangana rashtra samithi trs;warangal;congress;huzur nagar;nalgonda;prime minister;cabinet;ranga reddy;reddy;mahbubnagar;party;sasanamandaliమండలి చైర్మెన్ గా వాణిదేవీ!మండలి చైర్మెన్ గా వాణిదేవీ!surabhi vanidevi;kcr;hyderabad;telangana rashtra samithi trs;warangal;congress;huzur nagar;nalgonda;prime minister;cabinet;ranga reddy;reddy;mahbubnagar;party;sasanamandaliFri, 26 Mar 2021 20:40:42 GMTటీఆర్ఎస్ పార్టీ రెండు సీట్లలో విజయం సాధించింది. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానం నుంచి వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీజేపీకి సిట్టింగ్ స్థానమైన   హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు కూతురు వాణిదేవీ సంచలన విజయం సాధించారు. నిజానికి ఈ రెండు సీట్లలో గులాబీ పార్టీకి ఏమాత్రం గెలిచే అవకాశం లేదని అంతా భావించారు. అందుకే అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే ప్రచారం జరిగింది.  వాణిదేవీని చివరి నిమిషంలో బరిలోకి దింపారు గులాబీ బాస్.

ప్రతికూల పరిస్థితిల్లో పోటీలో దిగి విజయం సాధించిన వాణిదేవీకి కీలక పోస్టు దక్కనుందని తెలుస్తోంది. హైదరాబాద్ లో టీఆర్ఎస్ విక్టరీకి వాణీదేవీ అభ్యర్థిత్వమే కారణమని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. అందుకే వాణిదేవీని ఎమ్మెల్సీతో సరిపెట్టకుండా కీలక పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అధినేతకు ఇదే సూచన చేశారని తెలుస్తోంది.వాణిదేవీకి ఏ పదవి కట్టాబెట్టాలన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. కేబినెట్ బెర్త్ కాకుండా వాణిదేవీకి శాసనమండలి చైర్మెన్ పదవి ఇవ్వాలని సూచన కొందరు నేతలు చేశారంటున్నారు.దీంతో వాణిదేవీకి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.

ఇప్పటికే వీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సీఎం సిఫారసు చేశారు. పీవీ కుమారుడు ప్రభాకర్‌రావుకు కీలక పదవి ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రధానిగా పీవీకి ఉన్న పేరును.. ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానాన్ని తన ఖాతాలో వేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే వాణీదేవిని మండలి పెద్ద కుర్చీలో కూర్చోబెట్టాలనే భావిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీకాలం జూన్‌లో ముగుస్తుంది. వాణీదేవిని మండలిచైర్మన్‌గా చేస్తే గుత్తాకు పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సర్దుబాటు చేసే పనిలో పడ్డారని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి.


ఎమ్మార్వో ఆఫీస్ కి తాళం వేసిన. మహిళ.. ఎందుకో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>