PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congressc40b20be-1714-41bf-a27e-126af4f5de8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congressc40b20be-1714-41bf-a27e-126af4f5de8a-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీలోని అస‌మ్మ‌తి సెగ‌ల‌ను ఎగ‌దోసే కార్య‌క్ర‌మాన్ని కొంత‌మంది చేప‌డుతున్న‌ట్లు ఆ పార్టీ అభ్య‌ర్థి జానారెడ్డి ప‌సిగ‌ట్టిన‌ట్లు స‌మాచారం. పార్టీశ్రేణులు స‌హ‌క‌రించ‌కుండా కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారంట‌. అయితే జానారెడ్డి ఇక్క‌డి నుంచి చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఎన్నిక‌వుతూ వ‌చ్చారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి స‌త్సంబంధాలున్నాయి. మొద‌టిసారిగా ఆయ‌న దివంగ‌త‌ నోముల న‌ర్సింహ్మ‌య్య చేతిలో ఓట‌మి పాల‌య్యారు. నోముల ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో జానారెడ్డి మ‌ళ్లjanareddy;kcr;telangana rashtra samithi trs;congress;janareddy;partyసాగ‌ర్‌లో వాళ్లే జానారెడ్డికి మైన‌స్ కానున్నారా..?సాగ‌ర్‌లో వాళ్లే జానారెడ్డికి మైన‌స్ కానున్నారా..?janareddy;kcr;telangana rashtra samithi trs;congress;janareddy;partyFri, 26 Mar 2021 07:02:00 GMTకాంగ్రెస్ పార్టీలోని అస‌మ్మ‌తి సెగ‌ల‌ను ఎగ‌దోసే కార్య‌క్ర‌మాన్ని కొంత‌మంది చేప‌డుతున్న‌ట్లు ఆ పార్టీ అభ్య‌ర్థి  జానారెడ్డి ప‌సిగ‌ట్టిన‌ట్లు స‌మాచారం. పార్టీశ్రేణులు స‌హ‌క‌రించ‌కుండా కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారంట‌. అయితే జానారెడ్డి ఇక్క‌డి నుంచి చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఎన్నిక‌వుతూ వ‌చ్చారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి స‌త్సంబంధాలున్నాయి. మొద‌టిసారిగా ఆయ‌న దివంగ‌త‌ నోముల న‌ర్సింహ్మ‌య్య చేతిలో ఓట‌మి పాల‌య్యారు. నోముల ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో జానారెడ్డి మ‌ళ్లీ అభ్య‌ర్థిగా ఉంటున్నారు. ఇప్పుడు ప్ర‌జ‌లు చాలాకాలంగా ఎమ్మెల్యేగా ప‌నిచేసిన జానారెడ్డి వైపు ఉంటారా..?  లేదంటే టీఆర్ ఎస్ అభ్య‌ర్థి వైపు ఉంటారా అన్న‌ది మ‌రి కొద్దిరోజులు ఆగితేగాని తెలియదు.


అయితే కొంత‌మంది సొంత పార్టీ నాయకుల క‌ద‌లిక‌లు, వ్య‌వ‌హారశైలిపై జానారెడ్డి కాస్తంత కంగారుగా ఉన్న‌ట్లుగా స‌మాచారం. వారు పార్టీలో ఉంటూనే అధికార పార్టీకి స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారంట‌. అలాంటి వారి జాబితాను కూడా సిద్ధం  చేసుకుని ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.కేసీఆర్ ఆదేశాలతో సాగర్‌లో పార్టీ ఇప్పటికే తమ పని కానిస్తూ ముందుకు సాగుతోంది. పార్టీ నేతలంతా అభ్యర్ధి ఎవరనే దానికంటే అంతర్గతంగా ప్రచారంపై దృష్టి సారించారు.అభివృద్ధి పనులు శంఖుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు. సాగర్‌లో కాంగ్రెస్ నేత జానారెడ్డిని ఢీ కొట్టలేని పక్షంలో అక్కడ ఎట్టి పరిస్థితిలోను టీఆర్ఎస్ రెండో స్థానంలోఉండేలా చూసుకుంటున్నారట.


ఇందుకు యాదవ సామాజిక వర్గాన్ని అక్కున చేకూర్చుకోవడానికి దివంగత నేత నోములు నర్శింహయ్య కుమారుడు భరత్‌ను బరిలో దింపితేసానుభూతి ఓట్లతో పాటు పార్టీ బలంతో వచ్చే ఓట్లు కూడా ఉపయోగ పడతాయనే అంచనాలో ఉన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీటీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. అక్కడ కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. దీంతో టీఆర్ఎస్ నుంచిఎవరు పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు అవకాశం ఉంటుందా లేక కొత్త అభ్యర్థిని రేసులో దింపాలా అనే యోచనలో ఉన్నారట కేసీఆర్‌.


ప్ర‌పంచ రైతు ఉద్య‌మాలకు స్ఫూర్తి... మ‌న రైతులు చాలా గ్రేట్‌...

హెరాల్డ్ స్మ‌రామీ : నిబ‌ద్ధ‌త‌తో సినిమాల‌ను నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావు

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ రాజుగారికి జనసేనతో తలనొప్పే...

తన బావమరిది సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అభ్యర్ధితోనే బీజేపీ సీన్ ఏమిటో అర్ధమైపోయిందా ?

రాజమౌళి సినిమాలలో కనిపించే ఈ కామన్ పాయింట్స్ ను ఎప్పుడైనా గుర్తించారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>