SportsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli60ec709b-ab7e-444f-bedb-0a002763cf70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli60ec709b-ab7e-444f-bedb-0a002763cf70-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోనూ బాగా స్కోర్ చేస్తూ అనేక రికార్డులను బద్దలు కొడుతున్నారు. కెప్టెన్ గా ఆయన నమోదు చేస్తున్న రికార్డులు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఆయన పూణే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్ లో మూడవ స్థానంలో బ్యాటింగ్ దిగి 66 పరుగులు చేశారు. దీనితో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో మూడవ స్థానంలో బ్యాటింగ్ కి దిగి 10,000 పరుగులు మైలురాయిని ఛేదించిన 2వ క్రికెటర్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు మూడవ ఆర్డర్ లvirat kohli;virat kohli;cricket;india;south africa;australia;england;international;pune;paruguమరో అరుదైన రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ..మరో అరుదైన రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ..virat kohli;virat kohli;cricket;india;south africa;australia;england;international;pune;paruguFri, 26 Mar 2021 18:46:00 GMTఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోనూ బాగా స్కోర్ చేస్తూ అనేక రికార్డులను బద్దలు కొడుతున్నారు. కెప్టెన్ గా ఆయన నమోదు చేస్తున్న రికార్డులు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఆయన పూణే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్ లో మూడవ స్థానంలో బ్యాటింగ్ దిగి 66 పరుగులు చేశారు. దీనితో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో మూడవ స్థానంలో బ్యాటింగ్ కి దిగి 10,000 పరుగులు మైలురాయిని ఛేదించిన 2వ క్రికెటర్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు మూడవ ఆర్డర్ లో దిగి 10,000 పరుగులు చేసిన క్రికెట్ ఆటగాళ్లలో ఒక్కరే ఉన్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్.


ఆస్ట్రేలియా మాజీ క్యాప్టెన్ అయిన రికీ పాంటింగ్‌ థర్డ్ ఆర్డర్ లో దిగి ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఆయన తన కెరీర్‌ లో వన్డే ఫార్మాట్‌ లో మూడో నంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా మైదానంలోకి దిగి మొత్తంగా 12,662 పరుగులు చేశారు. అయితే ఆయన నెలకొల్పిన ఈ రికార్డుని ఏ థర్డ్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ కూడా అందుకోలేకపోయారు. కానీ భారత క్రికెటర్ కోహ్లీ అనూహ్యమైన ఆట ఆడుతూ రికీ పాంటింగ్‌ ని అధిగమించే దిశగా ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ జాబితాలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 5421 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు.


ఇక ఈ వన్డే మ్యాచ్‌ లో కోహ్లి మరో రికార్డు నమోదు చేశారు. 50- ఓవర్ల క్రికెట్‌ లో అత్యధిక పరుగులు చేసిన ఐదో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచారు. సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ 5,416 పరుగులతో కెప్టెన్‌గా ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. అయితే అతడిని అధిగమించి 5వ స్థానానికి ఎగబాకిన కోహ్లీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు.


హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>