Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/vvs-laxman-praise-team-india-young-players71bf3a28-bcc8-4533-a938-02f78f046d80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/vvs-laxman-praise-team-india-young-players71bf3a28-bcc8-4533-a938-02f78f046d80-415x250-IndiaHerald.jpg టీమిండియా అంటే ఎప్పుడూ సీనియర్ ఆటగాళ్లపైనే ఆధారపడేది. కానీ గతేడాది నుంచి ఈ ఏఢాది ప్రారంభం వరకు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌తో ఈ లెక్క పూర్తిగా తప్పింది. సీనియర్లు లేకపోయినా.. కనీస అంతర్జాతీయ అనుభవం లేని, విదేశీ గడ్డపై ఆడని రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు ఆసీస్ దిగ్గజ జట్టును మట్టి కరిపించి చరిత్ర..suryakumar yadav;krishna;lakshman;varsha;cricket;navdeep saini;australia;bcci;history;qualification;yuva;international;icc t20‘అమ్మో టీమిండియా కుర్రాళ్లు.. సీనియర్లకు ఏ మాత్రం తగ్గట్లేదుగా..’‘అమ్మో టీమిండియా కుర్రాళ్లు.. సీనియర్లకు ఏ మాత్రం తగ్గట్లేదుగా..’suryakumar yadav;krishna;lakshman;varsha;cricket;navdeep saini;australia;bcci;history;qualification;yuva;international;icc t20Fri, 26 Mar 2021 07:23:00 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా అంటే ఎప్పుడూ సీనియర్ ఆటగాళ్లపైనే ఆధారపడేది. కానీ గతేడాది నుంచి ఈ ఏఢాది ప్రారంభం వరకు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌తో ఈ లెక్క పూర్తిగా తప్పింది. సీనియర్లు లేకపోయినా.. కనీస అంతర్జాతీయ అనుభవం లేని, విదేశీ గడ్డపై ఆడని రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు ఆసీస్ దిగ్గజ జట్టును మట్టి కరిపించి చరిత్ర సృష్టించారు. మహ్మద్‌ సిరాజ్‌.. నటరాజన్‌.. నవదీప్‌ సైనీ.. వాషింగ్టన్‌ సుందర్‌.. శుభ్‌మన్‌ గిల్‌.. ఆస్టేలియా పర్యటనలో అదరగొట్టిన యువ ఆటగాళ్లు. కనీస అనుభవం లేకపోయినా ఆస్ట్రేలియాను ఆ దేశ గడ్డపైనే ఓడించి కప్పు పట్టుకొచ్చేశారు.


ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌ ద్వారా కూడా కొంతమంది యువ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. తొలి మ్యాచ్‌లలోనే సత్తా చాటి భేష్ అనిపించారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ రెండో మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశారు. ఇక వన్డేల విషయానికొస్తే కృనాల్‌ పాండ్యా, ప్రసిద్ద్‌ కృష్ణ కూడా తొలి వన్డేతో అరంగేట్రం చేశారు. తొలి వన్డేలోనే వీరిద్దరూ అనేక రికార్డులు నెలకొల్పారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించని స్థాయిలో అతితక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసి కృనాల్ సత్తా చాటగా.. సీనియర్ బౌలర్లకంటే తానేమాత్రం తీసిపోనని ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు.

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ యువ క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కొన్ని రోజులుగా యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. రెండో టీ20లో ఇషాన్‌ కిషన్‌ అరంగేట్రం చేసి అర్థ సెంచరీతో అదరగొట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా అదే మ్యాచ్‌తో జట్టులోకొచ్చినా బ్యాటింగ్ చేయలేకపోయాడు.

బ్యాట్ చేతికి వచ్చిన నాలుగో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అందుకే త్వరలో రాబోయే టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో వీళ్లిద్దరూ ఉండాలని నేను భావిస్తున్నాను. వరల్డ్‌‌కప్‌ తుదిజట్టులో ఆడేందుకు వీరిద్దరికి పూర్తి అర్హత ఉంది’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. మరి లక్ష్మణ్ ఆలోచనపై బీసీసీఐ దృష్టి సారిస్తుందేమో చూడాలి.


ఏపీలో కొలువుల జాతర..సి‌ఎం జగన్ ఆదేశాలు..!!

హెరాల్డ్ స్మ‌రామీ : నిబ‌ద్ధ‌త‌తో సినిమాల‌ను నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావు

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ రాజుగారికి జనసేనతో తలనొప్పే...

తన బావమరిది సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అభ్యర్ధితోనే బీజేపీ సీన్ ఏమిటో అర్ధమైపోయిందా ?

రాజమౌళి సినిమాలలో కనిపించే ఈ కామన్ పాయింట్స్ ను ఎప్పుడైనా గుర్తించారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>