MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prakashrajf37a64db-b6ca-42db-8514-97f373b1e112-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prakashrajf37a64db-b6ca-42db-8514-97f373b1e112-415x250-IndiaHerald.jpgప్రకాష్ రాజ్. పుట్టింది కన్నడీగుడిగా, కానీ మెట్టింది తమిళ సీమకు. ఆ వైపు నుంచి తెలుగులోకి, అలా బాలీవుడ్ కి కూడా తన నటనతో జైత్ర యాత్ర చేసిన దిగ్గజం. ప్రకాష్ రాజ్ ఒక అరుదైన నటనకు మచ్చు తునక. ఆయనకు ముందు అలాంటి స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎవరికీ లేదు, ఆయనది ప్రత్యేకమైన ఒక బ్రాండ్. prakashraj;prakash raj;raj;bollywood;tollywood;telugu;television;tamil;writer;producer;director;producer1;march;yatra;narappaసామాన్యుడు కాడు...?సామాన్యుడు కాడు...?prakashraj;prakash raj;raj;bollywood;tollywood;telugu;television;tamil;writer;producer;director;producer1;march;yatra;narappaFri, 26 Mar 2021 19:30:00 GMTతమిళ సీమకు.   ఆ వైపు నుంచి తెలుగులోకి, అలా బాలీవుడ్ కి కూడా తన నటనతో జైత్ర యాత్ర చేసిన దిగ్గజం. ప్రకాష్ రాజ్ ఒక అరుదైన నటనకు మచ్చు తునక. ఆయనకు ముందు అలాంటి స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎవరికీ లేదు, ఆయనది ప్రత్యేకమైన  ఒక బ్రాండ్.

ప్రకాష్ రాజ్ 1965 మార్చి 26న కర్నాటకలో  పుట్టారు. ఆయన చిన్ననాటి నుంచి చదువు కంటే కూడా నటన మీదనే ఎక్కువ మక్కువ చూపించారు. అలా వీధి నాటకాలు, స్టేజ్ నాటకాలూ వేస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. ఒక నెలలో మూడు వందలకు పైగా నాటకాలు వేసిన రికార్డ్ కూడా ప్రకాష్ రాజ్ సొంతం. ఆ తరువాత టెలివిజన్ చానల్ ద్వారా కూడా ప్రకాష్ రాజ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.

ఆయన నటనను చూసిన ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచంద్ర డ్యూయట్ సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ తరువాత మళ్ళీ వెనక్కి చూసుకోలేదు ప్రకాష్ రాజ్. తెలుగులో ఆయన  ఎంట్రీ ఇవ్వడమే చాలు అన్నట్లుగా  వరసపెట్టి సినిమాలు క్యూ కట్టాయి. అలా టాలీవుడ్ అగ్ర నటుల సినిమాల్లో మెయిన్ విలన్ అంటే ఆయనే అన్నట్లుగా ఒక దశలో హవా సాగింది. ఆయనకు అయిదు జాతీయ పురస్కారాలు లభించాయి. ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మరెన్నో నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ అవార్డులు కూడా దక్కాయి. ప్రకాష్ రాజ్ అంతపురంలో నటించిన నటనకు జాతీయ అవార్డు దక్కడం విశేషమే. ఇక ప్రకాష్ రాజ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే తీరు అద్భుతంగా ఉంటుంది. ఆయన నటనకు హద్దులు లేవు. ఆయన దగ్గర డైరెక్టర్లు ఎంత పిండుకుంటే అన్నట్లుగా బెస్ట్ ఇస్తారు.

ప్రకాష్ రాజ్ కేవలం నటుడే కాదు, ఆయనలో మంచి రచయిత ఉన్నాడు. డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా కూడా తన బహుముఖీయమైన నటనా ప్రతిభను చాటారు. ఆయన మరింత కాలం మరిన్ని సినిమాలు చేస్తూ అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ నటించిన వకీల్ సాబ్, నారప్ప వంటి మూవీస్ విడుదలకు రెడీగా ఉన్నాయి.




ఫ్యాన్స్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫీ... సోషల్ మీడియా లో వైరల్ ....??

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>