PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/assom-elections210a823c-6724-4c5c-864d-e0de5a8e4f04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/assom-elections210a823c-6724-4c5c-864d-e0de5a8e4f04-415x250-IndiaHerald.jpgఅసోం.. ఈశాన్య ప్రాంత రాష్ట్రం.. ఓ చిన్న రాష్ట్రం.. ఇక్కడ రేపు పోలింగ్ జరగబోతోంది. అసోం అసెంబ్లీలో 126 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. మరి ఈసారి అసోం ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలేంటి.. ఏ అంశంపై ఏ పార్టీ ఏమంటోంది.. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించే అవకాశం ఉంది.. ఎవరి ఓట్లు కీలకం.. ఎందుకు.. ఇలాంటి విషయాలు పరిశీలిద్దాం.. అసోం రాజకీయాల్లో తేయాకు తోటల్లో పనిచేసే లక్షలాది మంది కూలీల ఓట్లు చాలా ప్రధానం. ఎందుకంటే.. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య దాదాపు ఐదో వంతు ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు టీ assom-elections;priya;rahul new;rahul;varsha;k l rahul;bharatiya janata party;rahul gandhi;mohandas karamchand gandhi;congress;mla;rahul sipligunj;thota chandrasekhar;party;paruguఅసోంలో గద్దెనెక్కేదెవరో తేల్చేసేది వీళ్లే...?అసోంలో గద్దెనెక్కేదెవరో తేల్చేసేది వీళ్లే...?assom-elections;priya;rahul new;rahul;varsha;k l rahul;bharatiya janata party;rahul gandhi;mohandas karamchand gandhi;congress;mla;rahul sipligunj;thota chandrasekhar;party;paruguFri, 26 Mar 2021 09:00:00 GMTఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. మరి ఈసారి అసోం ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలేంటి.. ఏ అంశంపై ఏ పార్టీ ఏమంటోంది.. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించే అవకాశం ఉంది.. ఎవరి ఓట్లు కీలకం.. ఎందుకు.. ఇలాంటి విషయాలు పరిశీలిద్దాం..

అసోం రాజకీయాల్లో  తేయాకు తోటల్లో పనిచేసే లక్షలాది మంది కూలీల ఓట్లు చాలా ప్రధానం. ఎందుకంటే.. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య దాదాపు ఐదో వంతు ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు టీ తోట వెంట పరుగులు తీశాయి. తేయాకు తోటల కూలీలపై హామీ వర్షం కురిపించాయి. తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు దాదాపు 40 నియోజకవర్గాల్లో  కీలక పాత్ర పోషిస్తారు.

అందుకే కాంగ్రెస్‌ తరఫున ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తేయాకు తోటలను సందర్శించారు. అక్కడి కూలీలతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కాసేపు వారితో కలిసి తేయాకు కూడా కోశారు. రాహుల్ గాంధీ వారితో కలసి భోజనం చేశారు. తేయాకు తోటల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల దినసరి కూలీ అంశం ఇప్పుడు అసోంలో ఓట్లు రాల్చే అంశంగా మారింది.

గత ఎన్నికల్లో అనుకోకుండా అధికారంలోకి వచ్చిన బీజేపీ తేయాకు తోటల్లో పనిచేసే కూలీల కోసం 3వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. అయితే దీనిపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే  కాంగ్రెస్‌ తేయాకు తోటల్లో పనిచేసే కూలీల దినసరి వేతనాన్ని 167రూపాయల నుంచి 365రూపాయలకు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది.  ఇక బీజేపీ మాత్రం తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న ఆశతో ఉంది. మరి అసోం ఓటరు ఎవరిని అందలమెక్కిస్తాడో చూడాలి.




అమెరికా కంపెనీలు క్యూ కడతాయా...?

ఏమిటీ డబుల్ మ్యుటేషన్ ? భారత్‌లో దీని ప్రభావం ఎంత ?

హెరాల్డ్ సెటైర్ : మిత్రపక్షమే అన్నాడీఎంకే కొంపముంచేస్తుందా ?

హైకోర్టు జడ్జిలకు అదిరిపోయే గిఫ్ట్ అందించబోతున్న జగన్..?

హెరాల్డ్ స్మ‌రామీ : నిబ‌ద్ధ‌త‌తో సినిమాల‌ను నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావు

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ రాజుగారికి జనసేనతో తలనొప్పే...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>