PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-alcohol-scam67a67499-e572-4762-8e94-6fd22d90f490-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-alcohol-scam67a67499-e572-4762-8e94-6fd22d90f490-415x250-IndiaHerald.jpgఏపీలో మధ్యపాన నిషేధం చేయడానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ టీమ్ కంకణం కట్టుకుంది. ఎలాగైనా పేద కుటుంబాల్లో ఆశా జ్యోతిని వెలిగించాలని మద్యంపై సమర శంఖం పూరించింది ఏపీ ప్రభుత్వం. ఇంతకు ముందు వచ్చిన చాలా ప్రభుత్వాలు ప్రజల కోసం మధ్యపానాన్ని నిషేదిస్తామని చెప్పినప్పటికీ ఏవీ పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ap-alcohol-scam;editor mohan;puri jagannadh;jagan;andhra pradesh;minister;letter;local language;sv mohan reddy;reddyజగన్ సారూ...మద్యనిషేధం ముసుగులో ఇంత మోసమా...?జగన్ సారూ...మద్యనిషేధం ముసుగులో ఇంత మోసమా...?ap-alcohol-scam;editor mohan;puri jagannadh;jagan;andhra pradesh;minister;letter;local language;sv mohan reddy;reddyFri, 26 Mar 2021 13:00:00 GMTజగన్ మోహన్ రెడ్డి అండ్ టీమ్ కంకణం కట్టుకుంది. ఎలాగైనా పేద కుటుంబాల్లో ఆశా జ్యోతిని వెలిగించాలని మద్యంపై సమర శంఖం పూరించింది ఏపీ ప్రభుత్వం. ఇంతకు ముందు వచ్చిన చాలా ప్రభుత్వాలు ప్రజల కోసం మధ్యపానాన్ని నిషేదిస్తామని చెప్పినప్పటికీ ఏవీ పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. దీనితో ప్రజలంతా ప్రస్తుతం జగన్ ఖచ్చితంగా మధ్యపాన నిషేధం చేస్తాడని బలంగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఉన్న పర్మిట్ రూములన్నింటినీ రద్దు చేశాడు. అంతే కాకుండా బెల్టు షాపులను మరియు బారులను మూయించేశాడు.  ఇప్పుడు ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులను నడుపుతోంది. దీని వలన ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించారు జగన్. దీనితో రాజకీయ నాయకులు మరియు స్థానిక నాయకుల ప్రభావం మద్యపానం వ్యాపారంపై లేకుండా చేశాడు.

మద్యానికి బానిసైన వారికి ఇష్టమైన బ్రాండ్లను అందుబాటులో లేకుండా చేయడం ద్వారా కొంత మేరకు మద్యం తాగే వారి సంఖ్యను తగ్గించవచ్చని ఏపీ సర్కారు వ్యూహం.  ఇలా మెల్ల మెల్లగా ఒకానొక సమయంలో  మద్యం షాపులను కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేయడం ద్వారా పూర్తిగా మద్యపానం నిషేదించవచ్చు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న ప్రస్తుతం ఒక ట్విస్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అదేమిటంటే ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ముందు చెప్పినట్లుగా ప్రతి నెలా ఈ ఎస్ ఐ మరియు పిఎఫ్ లను వారి జీతాల నుండి కట్ చేస్తున్నారని చెప్పారు. అసలు ఇప్పటి వరకు మా పేరు పైన ఎటువంటి ఈ ఎస్ ఐ మరియు పిఎఫ్ క్రియేట్ చేయలేదని ఒక ఉద్యోగి మెయిల్ రూపంలో తెలియచేశారు. ఇలా మా ఈ ఎస్ ఐ, పిఎఫ్ ల రూపంలో మోత రాష్ట్రం మీద ఒక నెలకు అందరి ఉద్యోగుల మీద కలుపుకుని రెండు కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని తెలిసింది.

ఈ సమస్య 18 నెలలుగా ఉన్నట్లు సదరు ఉద్యోగి తెలియచేశారు. అంటే మొత్తం 36 కోట్ల రూపాయలు సొమ్మును కాజేశారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది మనకు అర్థమవుతోంది.   అంతే కాకుండా మాకు చెల్లించవలసిన జీతాలు కూడా ప్రతి నెలా 15 నుండి 20 వ తేదీలలో చెల్లిస్తున్నారని వాపోయాడు. ఇది తెలిసిన పలువురు ఈ విషయంపై సీఎం జగన్ మరియు ఎక్సైజ్ మంత్రి అసలు విషయం ఏమి జరిగిందనేది తేల్చాల్సి ఉంది.  ఇలా ఎందుకు జరుగుతోంది మరియు దీనికి అసలు కారకులు ఎవరన్నది తెలుసుకొని వారిని ఖచ్చితంగా శిక్షించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వమే ఉద్యోగాన్ని కల్పించి ఈ విధంగా ఉద్యోగుల సొమ్మును దోపిడీ చెయ్యడమనేది చాలా దారుణంగా ఉందని కొంతమంది ఉద్యోగులు తమ గోడును తెలిపారు. మరి ఈ సమస్యను ఏపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందా...? అసలు ప్రభుత్వానికి సంబంధించి కాంట్రాక్టర్లు ఉండడం...ఏమిటి...? ఇలాంటి పలు అంశాలు తెలియాల్సి వుంది.


గుమ్మడికాయ విత్తనాల వలన మగవారికి ఎన్ని లాభాలో.. !!

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?

అనసూయ బుల్లితెరకు దూరమవుతోందా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>