PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-is-this-your-political-strategy-76d42724-6d47-44fe-b3ea-8c215c572264-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-is-this-your-political-strategy-76d42724-6d47-44fe-b3ea-8c215c572264-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి నుంచి మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. ఎన్నిక‌ల వ్యూహాల్లోకానీ, ఇత‌ర‌త్రా వ్యూహాల‌ను అమ‌లు చేయ‌డంలోకానీ చంద్ర‌బాబు ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధిచెందారు. రాజ‌కీయ చాణ‌క్యుడిగా పేరుగ‌డించిన చంద్ర‌బాబుకు ఇప్పుడే అదే రాజ‌కీయాల నుంచి స‌వాల్ ఎద‌ర‌వుతోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌వాల్ విసురుతున్నారు. త‌న‌దైన శైలిలో రాజ‌కీయ వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ycp, jagan, chadrababu, tdp;view;rbi;district;telugu;amaravathiఅమ్మ జ‌గ‌న్‌... మీ వ్యూహం ఇదా??అమ్మ జ‌గ‌న్‌... మీ వ్యూహం ఇదా??ycp, jagan, chadrababu, tdp;view;rbi;district;telugu;amaravathiFri, 26 Mar 2021 14:56:24 GMT
చేయూత‌తో ఓట‌ర్ల చేయూత‌
మ‌రో రెండురోజుల్లో న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న‌గా 45 సంవ‌త్స‌రాలు నిండిన అగ్ర‌వ‌ర్ణ మ‌హిళ‌ల‌కు చేయూత ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. ఈ ప‌థ‌కం కింద‌ ఏటా రూ.15 వేలు అందిస్తారు. అదేస‌మ‌యంలో మ‌హిళా ఉద్యోగులకు మెట‌ర్నిటీ సెల‌వులు, క్యాజువ‌ల్ సెల‌వుల‌ను పెంచారు. మ‌హిళ‌ల కోసం తీసుకున్న ఈ రెండు నిర్ణ‌‌యాలు ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌బావం చూపించాయి. వాస్త‌వానికి జ‌గ‌న్ వేసిన ఈ వ్యూహాన్ని తెలుగుదేశం నేత‌లు గుర్తించ‌లేక‌పోయారు. గుర్తించినా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

ఓర్వ‌క‌ల్లుకు ఉయ్యాల‌వాడ పేరు
ప్ర‌తి అడుగు రాజ‌కీయంగా బ‌లోపేతం కావ‌డానికి వేస్తున్న జ‌గ‌న్‌రెడ్డి తాజాగా క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు విమానాశ్ర‌యంలో విమానాల రాక‌పోక‌ల‌ను ప్రారంభించారు. క‌ర్నూలు ప్ర‌జ‌ల సెంటిమెంటును ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌కు అనుకూలంగా అమ‌ల‌చుకున్నారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పేరు పెడుతున్న‌ట్లు అక్క‌డి వేదిక‌పైనే ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల కోరిక‌ల‌ను తానొక్క‌డే తీర్చేది.. ప్ర‌త్యామ్నాయం మ‌రెవ‌రూ లేర‌న్న‌రీతిలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు.

అమ‌రావ‌తి కోసం జీవో
మూడు బ్యాంకుల నుంచి రూ.10వేల కోట్లు అప్పుచేసి మూడు ద‌శ‌ల్లో రాజ‌ధానిని అభివృద్ధి చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందంటూ జీవో జారీచేశారు. అమ‌రావ‌తిని త‌ర‌లిస్తున్నార‌నే విమ‌ర్శ‌ల‌ను ఆప‌గలిగారు. రూ.3 వేల కోట్ల‌ను ప్ర‌భుత్వ హామీపై తీసుకుంటున్నామ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్త‌ర్వుల‌వ‌ల్ల త‌క్ష‌ణ‌మే ఎవ‌రూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌లేక‌పోయారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌తి అడుగూ అత్యంత ప‌క‌డ్బందీగా వేస్తున్నార‌ని, ప్ర‌తి అడుగులో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు స‌మ‌కూరుతున్నాయ‌ని, వీటిని గుర్తించి ఎత్తుగ‌డ‌లు అనుస‌రించ‌క‌పోతే మున్ముందు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల భావ‌న‌.


హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>