MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raanaf7adf8ea-fe39-44f2-89f7-6a0312fde3ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raanaf7adf8ea-fe39-44f2-89f7-6a0312fde3ca-415x250-IndiaHerald.jpgత్రిభాషా చిత్రంగా తెరెకెక్కిన 'అరణ్య' సినిమా దేశవ్యాప్తంగా ఈరోజు థియేటర్ లోకి రాబోతుంది. రానా, విష్ణు విశాల్ తదితర నటులతో వంటి పరిణతి చెందిన నటులతో తెరకెక్కించిన త్రిభాషా చిత్రం 'అరణ్య' సినిమా టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.raana;rana;anant mahadevan;zoya hussain;bhavana;mahadevan;manu;prakruti;rani;vishal krishna;cinema;cinema theater;minister;cinema theatre;chitramరానా అరణ్య రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ఉందంటే...?రానా అరణ్య రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ఉందంటే...?raana;rana;anant mahadevan;zoya hussain;bhavana;mahadevan;manu;prakruti;rani;vishal krishna;cinema;cinema theater;minister;cinema theatre;chitramFri, 26 Mar 2021 09:21:11 GMT
త్రిభాషా చిత్రంగా తెరెకెక్కిన 'అరణ్య' సినిమా దేశవ్యాప్తంగా ఈరోజు థియేటర్ లోకి రాబోతుంది. రానా, విష్ణు విశాల్ తదితర నటులతో వంటి పరిణతి చెందిన నటులతో తెరకెక్కించిన త్రిభాషా చిత్రం 'అరణ్య' సినిమా టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికి వస్తే రానా ప్రకృతి ప్రేమికుడు, జంతులంటే ఆయనకి అమితమైన ఇష్టం. రానా ఆ అడవికి మరియు జంతువులకి రక్షకుడిగా ఉంటాడు. ముఖ్యంగా ఆ అడవిలో నివసించే గిరిజనులకు మరియు ఏనుగులకు అండగా ఉంటాడు. కట్ చేస్తే అటవీ శాఖ మంత్రి అనంత్ మహదేవన్ ఆ అడవిలో ఒక టౌన్ షిప్ కట్టాలని అనుకుంటాడు. అందుకోసం అడవిని నాశనం చేయాలనీ భావిస్తాడు. మరి రానా తన అడవిని మరియు జంతువులని కాపాడుకోవడం కోసం ఏమి చేసాడు అన్నది మిగతా కథ.

నటన విషయానికి వస్తే రానా అరణ్య పాత్రలో జీవిచేసాడు. అచ్చం  అడవి మనిషిలా అతని హావభావాలు, నటన మనకి ఆ పాత్ర కోసం అతడు ఎంత కష్ట్టపడ్డాడో మనకి తెర పై కనిపిస్తుంది. ఇక విషు విశాల్ కూడా తన పాత్రకి తగ్గట్టు నటించాడు. అలాగే విలేకరిగా శ్రీయా పింగోల్కర్, నక్సలైట్ గా జోయా హుస్సేన్ తమ పాత్రల మేర నటించారని చెప్పవచ్చు. ఇక విలన్ పాత్రలో అనంత్ మహదేవన్ చాలా చక్కని నటనను కనబరిచాడు. మిగతా వాళ్ళు కూడా ఎవరి పాత్రలో వాళ్ళు రాణించారు.

'అరణ్య' రానా ఈ సినిమాను ప్రకటించగానే రానా కొత్త కథను ఎంచుకున్నారని చాలా మంది అన్నారు. అలాగే  మనుషులు తమ స్వార్థం కోసం ఏనుగుల జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తున్నారనే పాయింట్ తో రావడం వల్ల ఇది ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక రానా అరణ్య కోసం ప్రేక్షకుల ఎదురుచూడటం మొదలైంది. ఆలా ఈరోజుకి సినిమా థియేటర్ లోకి వచ్చింది.

ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే, కథ పాయింట్ బాగున్నా, దానిని ఆసక్తికరంగా  నడిపించడంలో  దర్శకుడు ప్రభు సాల్మన్ విఫలం అయ్యారని చెప్పవచ్చు. తెర పై పాత్రల పరిచయాలు బాగానే చేసిన ఆ తర్వాత కథనం లోపం కారణంగా ప్రేక్షకుడికి  సినిమా పై మెల్లిగా ఆసక్తి సన్నగిల్లుతుంది. కథ పూర్తిగా పక్కకి వెళ్లపోతుందనే భావన కలుగుతుంది. ఏనుగుల కోసం అరణ్య పోరాడుతున్నతీరు మరియు రానా కి, ఏనుగులకు మధ్య వచ్చే సన్నివేశాలు పూర్తిగా తేలిపోయాయి. దర్శకుడు రానా పాత్రని ఇంకా బాగా రాసుకొని ఉంటె  బాగుండేదని ఆలోచన రాకా తప్పదు.  

చివరగా సాంకేతిక వర్గం గురించి చూస్తే సినిమాటోగ్రఫీ పనితీరు ఆకట్టుకుంది. ఇక సినిమాకి మేజర్ గా  బాక్గ్రౌండ్ స్కోర్  హైలెట్ అని చెప్పవచ్చు. కొన్ని సీన్స్ లో వచ్చే మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగా కుదిరాయి. వీటి వల్ల మీరు అడవిలో ఉన్నామనే భావన కలుగుతుంది.
ఇదండీ త్రిభాషా చిత్రం అరణ్య రివ్యూ..


ఏపీ చిన్నారుల‌కు `పినాకిల్ బ్లూమ్‌` ఆరోగ్య హ‌స్తం..!

ఇలా అయితే.. జ‌గ‌న్-సాయిరెడ్డిల‌ను న‌మ్మెదెవ‌రు... ఢిల్లీలో ప‌రువు పోయిందా ?

ఆ హీరో సినిమాలో అతిధి పాత్రలో సందడి చేయనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

వైసీపీ నేతలు బాబుపై మొరగడమేనా.. ఏమైనా కరిచేది ఉందా..?

ఏమిటీ డబుల్ మ్యుటేషన్ ? భారత్‌లో దీని ప్రభావం ఎంత ?

ప్ర‌పంచ రైతు ఉద్య‌మాలకు స్ఫూర్తి... మ‌న రైతులు చాలా గ్రేట్‌...

హెరాల్డ్ సెటైర్ : మిత్రపక్షమే అన్నాడీఎంకే కొంపముంచేస్తుందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>