PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mumbai-covid-hospital-in-fire-871ba0f5-d16e-451c-bae6-f9203c6c45e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mumbai-covid-hospital-in-fire-871ba0f5-d16e-451c-bae6-f9203c6c45e5-415x250-IndiaHerald.jpgమహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కరోనా హాస్పిటల్ లో మంటలు రావడంతో ఇద్దరు కరోనా రోగులు సజీవదహనమయ్యారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్‌లో ఉన్న సన్‌రైజ్ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో 76 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.covid hospital fire;prasanth;mumbai;police;local language;prashant kishorకరోనా ఆసుపత్రిలో మంటలు.. ఇద్దరు సజీవ దహనంకరోనా ఆసుపత్రిలో మంటలు.. ఇద్దరు సజీవ దహనంcovid hospital fire;prasanth;mumbai;police;local language;prashant kishorFri, 26 Mar 2021 08:54:00 GMT
ఆసుపత్రిలో మంటలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దాదాపు 70 మంది కరోనా బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. మాల్‌లోని మొదటి అంతస్తులో అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించిందని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు.

అగ్ని ప్రమాదం జరిగిన హాస్పిటల్ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. మాల్ లో నిబంధనలకు విరుద్దంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ముంబై నగర మేయర్ కిషోరి పడ్నేకర్ మాట్లాడుతూ.. అసలు ఓ మాల్‌లో ఆసుపత్రి ఉండడాన్ని తాను తొలిసారి చూస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు. ఏడుగురు రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, 70 మందిని మరో ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
అగ్ని ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక్కడ కోవిడ్ హాస్పిటల్ నిర్వహిస్తున్న విషయం తమకు తెలియదని స్థానికులు షాకవుతున్నారు. కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు.. కాసుల కక్కుర్తి కోసం ఎలాంటి వసతులు లేని మాల్ లో హాస్పిటల్ నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. 


'రంగ్ దే కి నితిన్ కాకుండా మరో హీరో అనుకున్నా'.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్..!!

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>