Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/ben-stokes-comments-on-kohli-ahead-of-2nd-one-day936b262d-e3bb-4fe7-b2da-7e13562caa79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/ben-stokes-comments-on-kohli-ahead-of-2nd-one-day936b262d-e3bb-4fe7-b2da-7e13562caa79-415x250-IndiaHerald.jpgమైదానంలో టీమిండియా కెప్టెన్ ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తనపై కానీ, తన జట్టుపై కానీ, జట్టు సభ్యులపై కానీ మాట పడనివ్వడు. ఏ మాత్రం తేడా వచ్చినా తానే ముందుగా రంగంలోకి దూకి ప్రత్యర్థితో మాటల యుద్ధానికి రెడీ అయిపోతాడు. తాజాగా టీ20 సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో బట్లర్‌తో జరిగిన వివాదమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. బట్లర్ ముందుగా నోరు జారడంతో..virat kohli;rani;virat kohli;india;icc t20;dookudu;ben stokes;paruguకోహ్లీలా మావల్ల కాదు బాబోయ్.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్కోహ్లీలా మావల్ల కాదు బాబోయ్.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్virat kohli;rani;virat kohli;india;icc t20;dookudu;ben stokes;paruguFri, 26 Mar 2021 10:15:00 GMTఇంటర్నెట్ డెస్క్: మైదానంలో టీమిండియా కెప్టెన్ ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తనపై కానీ, తన జట్టుపై కానీ, జట్టు సభ్యులపై కానీ మాట పడనివ్వడు. ఏ మాత్రం తేడా వచ్చినా తానే ముందుగా రంగంలోకి దూకి ప్రత్యర్థితో మాటల యుద్ధానికి రెడీ అయిపోతాడు. తాజాగా టీ20 సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో బట్లర్‌తో జరిగిన వివాదమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. బట్లర్ ముందుగా నోరు జారడంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి మాటలతోనే దీటుగా కౌంటరిచ్చాడు. అంపైర్ జోక్యంతో వివాదం ముగిసినా కోహ్లీ మాత్రం అంపైర్‌తో కూడా కొద్ది సేపు మాట్లాడాడు. ఈ క్రమంలోనే కోహ్లీ విధానంపై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీలా తమ వల్ల కాదని, అది అతడి జట్టుకు, అతడి జట్టు సభ్యులకు మాత్రమే చెల్లిందని, తమకు కుదరదని తేల్చి చెప్పాడు.

తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం బెన్ స్టోక్స్ మీడియాతో మాట్లాడాడు. ‘మైదానంలో దూకుడుగా వ్యహహరించడం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అతడి జట్టుకు సాధ్యమవుతుందేమో.  మాకు కుదరదు. ఒక్కో జట్టుది ఒక్కో శైలి ఉంటుంది. అయితే ప్రత్యర్థి తన ప్రవర్తనతో మంచి ఫలితాలు సాధిస్తుండడంతో మా ప్రవర్తన మార్చుకోవాల్సిన పనిలేదు. ప్రతీ జట్టుకు, ప్రతీ ఆటగాడికి తమదైన వ్యక్తిత్వం, పద్ధతులు ఉంటాయి. అదే వారి విజయానికి నాంది పలుకుతాయి. దూకుడుగా ఉండటం ఎల్లప్పుడూ సత్పలితాలను అందించదం’టూ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

తొలి వన్డేలో ఓటమి చవిచూసినా రెండో వన్డేలో గెలిచేందుకు, అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా పోరాడుతామని స్టోక్స్ అన్నాడు. కాగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ చేతిలో ఇంగ్లండ్ 66 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ రోజు(శుక్రవారం) జరగనున్న రెండో వన్డేలో అయినా కచ్చితంగా గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 1-0తో ఆధిక్యం సాధించడంతో మరొక్క మ్యాచ్ గెలిస్తే ఈ సిరీస్ కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.


సాగర్ బీజేపీఅభ్యర్ధి ఫైనల్...?

ఈ లాంగ్ వీకెండ్ విజేత ఎవరు కానున్నారో...?

షర్మిల ముందు జాగ్రత్త.. అనుచరులకు వార్నింగ్..

జగన్ చెప్పినా వీళ్ళకు లేక్కలేదా...?

కొర‌క‌రాని కొయ్య‌లా సీత‌క్క‌.... కేసీఆర్‌తో స‌హా అంద‌రిని ఏకి ప‌డేస్తోందిగా...!

ఇలా అయితే.. జ‌గ‌న్-సాయిరెడ్డిల‌ను న‌మ్మెదెవ‌రు... ఢిల్లీలో ప‌రువు పోయిందా ?

ఆ హీరో సినిమాలో అతిధి పాత్రలో సందడి చేయనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>