Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/son-in-law-seduced-mother-in-law-found-by-father-in-law9fb40643-c6f3-482b-855d-f2b2f1a278e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/son-in-law-seduced-mother-in-law-found-by-father-in-law9fb40643-c6f3-482b-855d-f2b2f1a278e8-415x250-IndiaHerald.jpgకొన్నిసార్లు మంచికి పోతే చెడు ఎదురవుతుంది. మన వాళ్లే కదా కష్టాల్లో ఉన్నారు, తోచిన సాయం చేద్దాం అని అనుకుంటే అది మన జీవితాన్నే దుర్భరం చేసేస్తుంది. తాజాగా తెలంగాణ జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లాలో అలాంటి సంఘటనే జరిగింది. ఆర్థిక పరిస్థితి క్షీణించి సొంత అక్క బాధపడుతుంటే చూడలేని ఓ తమ్ముడు తన మేనల్లుడిని ఇంటికి తీసుకొచ్చాడు. అతడికి అన్ని సౌకర్యాలూ కల్పించి..illegal affair;telangana;police;village;marriage;wife;local language;ranga reddyమేనల్లుడిని ఇంటికి తీసుకొస్తే మేనత్తపైనే కన్నేశాడు.. చివరకు.. ఛీ.. ఛీ..!మేనల్లుడిని ఇంటికి తీసుకొస్తే మేనత్తపైనే కన్నేశాడు.. చివరకు.. ఛీ.. ఛీ..!illegal affair;telangana;police;village;marriage;wife;local language;ranga reddyThu, 25 Mar 2021 08:16:14 GMTఇంటర్నెట్ డెస్క్: కొన్నిసార్లు మంచికి పోతే చెడు ఎదురవుతుంది. మన వాళ్లే కదా కష్టాల్లో ఉన్నారు, తోచిన సాయం చేద్దాం అని అనుకుంటే అది మన జీవితాన్నే దుర్భరం చేసేస్తుంది. తాజాగా తెలంగాణ జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లాలో అలాంటి సంఘటనే జరిగింది. ఆర్థిక పరిస్థితి క్షీణించి సొంత అక్క బాధపడుతుంటే చూడలేని ఓ తమ్ముడు తన మేనల్లుడిని ఇంటికి తీసుకొచ్చాడు. అతడికి అన్ని సౌకర్యాలూ కల్పించి హ్యపీగా ఉంచాడు. కానీ ఆ మేనల్లుడు మాత్రం మేనమామకే ఎసరు పెట్టాడు. అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని మేనమామకు షాకిచ్చాడు. ఇదేంటని నిలదీసిన మేనమామను అత్తతో కలిసి చంపేశాడు.  ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

గద్వాల జిల్లాలోని ధరూరు మండలం మార్లబీడు గ్రామంలో బంట్రోతు రంగారెడ్డి(32) మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. స్థానికంగానే తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా కొంత నిలదొక్కుకున్నాడు. అయితే అతడి తోబుట్టువు ఆర్థికంగా కష్టాల్లో ఉందని తెలిసి సాయం చేద్దామని అనుకున్నాడు. ఆమె కొడుకును ఇంటికి తెచ్చి తనతోనే ఉంచుకోసాగాడు. అతడి బాగోగులు చూసుకుంటున్నాడు.

ఆ మేనల్లుడిని చూసిన రంగారెడ్డి రెండో భార్యకు కోరిక కలిగింది. అంతే అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ల తర్వాత ఈ విషయం రంగారెడ్డికి తెలిసింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన రంగారెడ్డి ఇద్దరినీ నిలదీశాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయితే అక్రమ సంబంధం మోజులో వావివరసలు మర్చిపోయిన ఆ అత్తా-అల్లుడు తమకు అడ్డుగా ఉన్న రంగారెడ్డిని హతమార్చాలని ఫిక్సయ్యారు.

సోమవారం రాత్రి మద్యం తాగిన రంగారెడ్డి ఇంటి పక్కన ఉన్న గుడిసెలో నిద్రపోవడానికి వెళ్లాడు. అదే సమయంలో రంగారెడ్డి భార్య, మేనల్లుడు కలిసి అతడిపై దాడి చేశారు. గొడ్డలితో పలుమార్లు నరికి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఉంచారు. స్థానికులకు ఈ విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.

రంగారెడ్డిని అతడి భార్య, మేనల్లుడే హతమార్చారని తెలుసుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందుకే పాముకు పాలు పోస్తే మనల్నే కాటేస్తుందంటారు. సాయం చేయడం తప్పు కాదు.. చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం ముఖ్యం.


అందుకే ఎదగలేకపోయాం.. బిజెపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..?

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?

ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>