PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpcf99df7e-b479-4383-95cd-f5961f9c3340-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpcf99df7e-b479-4383-95cd-f5961f9c3340-415x250-IndiaHerald.jpgఏపీలో ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు టీడీపీ పూర్తిగా చేతులెత్తేసింది. వైసీపీకి వన్ సైడ్ విజయాలు వచ్చాయి. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి బలమైన స్థానాల్లో కూడా వైసీపీ గెలిచింది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా వైసీపీకి మంచి విజయాలు దక్కాయి. tdp;jagan;anagani satya prasad;mopidevi venkata ramana;2019;rajya sabha;assembly;mla;tdp;local language;ycp;party;repalleఆ టీడీపీ ఎమ్మెల్యే ఫిక్స్ అయిపోయారా?ఆ టీడీపీ ఎమ్మెల్యే ఫిక్స్ అయిపోయారా?tdp;jagan;anagani satya prasad;mopidevi venkata ramana;2019;rajya sabha;assembly;mla;tdp;local language;ycp;party;repalleThu, 25 Mar 2021 01:00:00 GMTటీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు టీడీపీ పూర్తిగా చేతులెత్తేసింది. వైసీపీకి వన్ సైడ్ విజయాలు వచ్చాయి. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి బలమైన స్థానాల్లో కూడా వైసీపీ గెలిచింది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా వైసీపీకి మంచి విజయాలు దక్కాయి.

ఈ దెబ్బకు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా అడ్రెస్ లేకుండా పోయారు. అనగాని టీడీపీ తరుపున పోటీ చేసి 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి గెలిచారు. జగన్ వేవ్‌లో సైతం గెలిచిన అనగాని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోయారు.

రేపల్లెలో మెజారిటీ పంచాయితీలు వైసీపీనే గెలుచుకుంది, అలాగే కీలకమైన రేపల్లె మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలోనే పడింది. ఇలా టీడీపీ దారుణంగా ఓడిపోవడం అనగానికి పెద్ద మైనస్ అవుతుంది. ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనగాని గెలుపు సాధ్యం కాదని తెలుస్తోంది. అయితే అనగాని టీడీపీలో పెద్ద యాక్టివ్ గా ఉండటం లేదు.

అలాగే అనగాని పార్టీలో పూర్తి స్థాయిలో పనిచేయడం తగ్గించేశారు. ఫలితంగానే స్థానిక ఎన్నికల్లో రేపల్లెలో టీడీపీ ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికలు అవ్వడమే అనగాని మళ్ళీ సైలెంట్ అయిపోయారు. గతంలోనే అనగాని పార్టీ మారిపోతారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలని ఖండించి అనగాని మళ్ళీ టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు.ఇక ఇప్పుడు అనగాని పరిస్థితులని బట్టి రాజకీయంగా అడుగులు వేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అవకాశం బట్టి పార్టీ జంపింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. పైగా తన ప్రత్యర్ధి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. దీంతో ఈయనకు రేపల్లెలో రూట్ క్లియర్‌గానే ఉంది. మరి చూడాలి భవిష్యత్‌లో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎలాంటి స్టెప్ వేస్తారో.




కుంచె పట్టి చిత్రాలు గీస్తున్న పంది... వైరల్ గా మారిన ఆ పెయింటింగ్స్..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>