PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/somu-veerraju-chandrababu-ap-special-status1b6e6a5c-72b3-459c-8902-ff75d1cb4efa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/somu-veerraju-chandrababu-ap-special-status1b6e6a5c-72b3-459c-8902-ff75d1cb4efa-415x250-IndiaHerald.jpgఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఇన్నాళ్లూ ప్రజలంతా అనుకుంటున్నారు. హోదా ఇవ్వలేం, కావాలంటే ప్యాకేజీ తీసుకోండని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం ఓ ఆప్షన్ ఇచ్చిందని, దాని ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారనే ప్రచారం కూడా ఉంది. హోదాకోసం పట్టుబట్టకుండా ప్యాకేజీతో సరిపెట్టుకున్నారని చంద్రబాబుపై విమర్శలున్నా.. అది కూడా దక్కకపోతే ఏపీకి మరింత అన్యాయం జరిగేదని కూడా కొంతమంది సర్ది చెబుతుంటారు. ఈ దశలో అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రsomu veerraju, chandrababu, ap special status;cbn;tiru;bharatiya janata party;andhra pradesh;government;tirupati;kanna lakshminarayana;chief minister;husband;thief;tdp;local language;central government;ycp;aadhar;dongaచంద్రబాబు రహస్యాన్ని బట్టబయలు చేసిన వీర్రాజు..చంద్రబాబు రహస్యాన్ని బట్టబయలు చేసిన వీర్రాజు..somu veerraju, chandrababu, ap special status;cbn;tiru;bharatiya janata party;andhra pradesh;government;tirupati;kanna lakshminarayana;chief minister;husband;thief;tdp;local language;central government;ycp;aadhar;dongaThu, 25 Mar 2021 07:00:00 GMTఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఇన్నాళ్లూ ప్రజలంతా అనుకుంటున్నారు. హోదా ఇవ్వలేం, కావాలంటే ప్యాకేజీ తీసుకోండని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం ఓ ఆప్షన్ ఇచ్చిందని, దాని ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారనే ప్రచారం కూడా ఉంది. హోదాకోసం పట్టుబట్టకుండా ప్యాకేజీతో సరిపెట్టుకున్నారని చంద్రబాబుపై విమర్శలున్నా.. అది కూడా దక్కకపోతే ఏపీకి మరింత అన్యాయం జరిగేదని కూడా కొంతమంది సర్ది చెబుతుంటారు. ఈ దశలో అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబేనంటూ కుండబద్దలు కొట్టారు ఏపీ బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు.

ఏపీకి బీజేపీ ఎలాంటి అన్యాయం చేయలేదని, ఏపీ ప్రజల్ని మోసం చేయలేదని అన్నారాయన. చంద్రబాబే ప్రజల్ని మోసం చేశారని, ఆయన వల్లే ప్రత్యేక హోదా రాకుండా పోయిందని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోదా కన్నా ప్యాకేజీయే ముద్దు అన్నారని, అందుకే కేంద్రం ప్యాకేజీవైపు మొగ్గు చూపిందని సెలవిచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబే దగ్గరుండి ప్యాకేజీ తీసుకున్నారని, అధికారం పోయాక టీడీపీ ఎంపీలు హోదా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా పోవడానికి కారణం చంద్రబాబేనని విమర్సించారు వీర్రాజు. ఒకవేళ అదే నిజమైతే.. హోదా అసలు సాధ్యం కాదంటూ కేంద్రం చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? హోదా ఇవ్వలేకపోతున్నాం కాబట్టే నష్టం జరక్కుండా ప్యాకేజీ ఇచ్చామని గతంలో కేంద్రమే ప్రకటించింది. అయితే వీర్రాజు మాత్రం తప్పంతా చంద్రబాబుపై నెట్టేశారు.

వాలంటీర్లను అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో గెలుస్తారా..?
తిరుపతి ఎన్నికల్లో ఇప్పటికే 2 లక్షల దొంగ ఓట్లను వేసేందుకు ఆధార్‌ కార్డులు తయారు చేసినట్టు తమవద్ద సమాచారం ఉందని చెప్పారు వీర్రాజు.  ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ దొంగ ఆధార్‌ కార్డులు, ఓటరు కార్డులు గుర్తించారని అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీలో ప్రజలు బీజేపీని గెలిపించకపోయినా బీజేపీ మాత్రం రాష్ట్రంపై ఎప్పుడూ చిన్నచూపు చూడలేదని స్పష్టం చేశారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. 


అందుకే ఎదగలేకపోయాం.. బిజెపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..?

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?

ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>