PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/national-award-to-the-prime-minister-for-best-actorf7d54d22-76fc-4fad-92b9-6e84e1f1d3b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/national-award-to-the-prime-minister-for-best-actorf7d54d22-76fc-4fad-92b9-6e84e1f1d3b6-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్ర‌భుత్వం జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019 సంవ‌త్స‌రానికి గ‌త సంవ‌త్స‌ర‌మే వీటిని ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా వాయిదా వేశారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌రు‌గుతున్నాయి కాబ‌ట్టి కొన్ని మార్పులు చేర్పుల‌తో అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. కేవ‌లం ఎన్నిక‌ల కోణ‌మే ఉందికానీ ఇందులో వేరే కోణం ఏమీ లేదు. అవార్డులు వెల్లడించిన ప్ర‌తిసారి కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. modi, bjp, film news, movies, latest news;modi;kangana ranaut;karthik;kumaar;dhanush;geetha;maharshi;2019;sangeetha;telugu;tamil;asuran;maharshi 1;dance;jersey;karthik siva kumar;khaidi.;gv prakash;central government;panga;khaidi new;manikarnika;mass;mission mangalజాతీయ ఉత్త‌మ న‌టుడిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీజాతీయ ఉత్త‌మ న‌టుడిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీmodi, bjp, film news, movies, latest news;modi;kangana ranaut;karthik;kumaar;dhanush;geetha;maharshi;2019;sangeetha;telugu;tamil;asuran;maharshi 1;dance;jersey;karthik siva kumar;khaidi.;gv prakash;central government;panga;khaidi new;manikarnika;mass;mission mangalThu, 25 Mar 2021 11:24:00 GMTకేంద్ర ప్ర‌భుత్వం జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019 సంవ‌త్స‌రానికి గ‌త సంవ‌త్స‌ర‌మే వీటిని ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా వాయిదా వేశారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌రు‌గుతున్నాయి కాబ‌ట్టి కొన్ని మార్పులు చేర్పుల‌తో  అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. కేవ‌లం ఎన్నిక‌ల కోణ‌మే ఉందికానీ ఇందులో వేరే కోణం ఏమీ లేదు.  అవార్డులు వెల్లడించిన ప్ర‌తిసారి కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు.

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు
త‌మిళ‌నాడులో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి అక్క‌డ ల‌బ్ధిపొంద‌డానికి ఉత్త‌మ సంగీత దర్శకుడిగా తమిళుడైన డి.ఇమాన్‌ను ఎంపిక చేశారు. ‘కుంకి’ (తెలుగులో గజరాజు) లాంటి సినిమాలు చూస్తే ఇమాన్ ప్రతిభ అర్థమవుతుంది. అలాంటి సినిమాకు కాకుండా ‘విశ్వాసం’ అనే మాస్ సినిమాకు ఇమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికవ‌డం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందులో సంగీత‌ప‌రంగా ప్ర‌త్యేక‌త కూడా లేదు. తెలుగులో ‘జెర్సీ’ సినిమాకు అనిరుధ్ అద్భుతమైన సంగీతం స‌మ‌కూర్చాడు. మరోవైపు ‘అసురన్’లో జీవీ ప్రకాష్ కుమార్ చీల్చిచెండాడాడు. ఇలాంటి సినిమాలను పక్కన పెట్టి ‘విశ్వాసం’ లాంటి రొటీన్ సినిమాకు అవార్డు ఇవ్వ‌డంవెన‌క కేవ‌లం రాజ‌కీయ కోణ‌మే ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

మోడీ స‌ర్కార‌కు అనుకూలం.. కంగ‌న‌
మోడీ స‌ర్కారుకు అనుకూలంగా, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌డంవ‌ల్లే కంగనా రనౌత్ను ఉత్తమ నటిగా ఎంపికైంది. మణికర్ణిక, పంగా సినిమాల్లో ఆమె బాగా చేసినప్పటికీ ప్రాంతీయ భాష‌ల్లో వ‌చ్చిన చిత్రాల్లో ఎంతోమంది హీరోయిన్లు గొప్ప నటన కనబరిచారని, వారిని పట్టించుకున్న‌వారే లేర‌ని సినీవిశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ‘సూపర్ 30’ సినిమాకు హృతిక్ రోషన్‌కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వకుండా ధనుష్, మనోజ్ బాజ్‌పేయికి ఎందుకు ప్ర‌క‌టించారో అంద‌రికీ తెలిసిందే. వీరిద్ద‌రూ అవార్డుల‌కు అర్హులే అయిన‌ప్ప‌టికీ హృతిక్ న‌ట‌ప‌రంగా సూప‌ర్ 30లో జీవించాడు.

ఖైదీకి ఎందుకు ఇవ్వ‌లేదో?
‘మహర్షి’కి రెండు జాతీయ అవార్డులు దక్కడంపై మన వాళ్ల నుంచే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘మిషన్ మంగళ్’ లాంటి సినిమాలకు ఉత్త‌మ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అవార్డు దక్కాల్సిందని, బెస్ట్ కొరియోగ్రఫీ ఇచ్చేంతగా ‘మహర్షి’ డ్యాన్సుల్లో ప్రత్యేకత ఏముందని ప్రశ్నిస్తున్నారు. మ‌హేష్ డాన్స్ గురించి పెద్ద‌గా మాట్లాడాల్సిన ప‌నికూడా లేదు. కార్తి నటించిన ‘ఖైదీ’కి అవార్డు ద‌క్క‌క‌పోవ‌డంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వానికి, ప్ర‌ధాన‌మంత్రికి ఉత్త‌మ న‌టుడి అవార్డులిస్తే బాగుంటుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.


రెండు వారాల్లో రికార్డు కలెక్షన్స్ నమోదు చేసిన జాతి రత్నాలు...

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>