MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vakeel-saab9f49d3da-5663-4511-827e-061699bdfcfe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vakeel-saab9f49d3da-5663-4511-827e-061699bdfcfe-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు covid-19 నిబంధనలు మరింత కఠినతరం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు కూడా మూసివేశారు. దీంతో ఇక సినిమా థియేటర్లను కూడా ముసివేస్తారేమోనని దర్శక నిర్మాతలు తెగ భయపడిపోతున్నారు. సినిమా అభిమానులు కూడా థియేటర్లు మూతపడితే తమ ఫేవరెట్ హీరోల సినిమాలు చూడటం కుదరదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన విడుదల కానున్న విషయం తvakeel saab;pawan;kalyan;pawan kalyan;srinivas;yajamanya;telangana;cinema;media;interview;minister;kavuru srinivas;coronavirusపవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..vakeel saab;pawan;kalyan;pawan kalyan;srinivas;yajamanya;telangana;cinema;media;interview;minister;kavuru srinivas;coronavirusThu, 25 Mar 2021 13:00:00 GMTకరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు covid-19 నిబంధనలు మరింత కఠినతరం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు కూడా మూసివేశారు. దీంతో ఇక సినిమా థియేటర్లను కూడా ముసివేస్తారేమోనని దర్శక నిర్మాతలు తెగ భయపడిపోతున్నారు. సినిమా అభిమానులు కూడా థియేటర్లు మూతపడితే తమ ఫేవరెట్ హీరోల సినిమాలు చూడటం కుదరదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా విపరీతంగా విజృంభిస్తున్నడంతో అభిమానులు ఊసురుమంటున్నారు.


సినిమా థియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన తర్వాత విడుదలయ్యే భారీ సినిమాల్లో వకీల్ సాబ్ మొట్టమొదటిది. మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ తారాగణం లో వస్తున్న మొదటి సినిమా "వకీల్ సాబ్" పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఏప్రిల్ 9 నాటికి సినిమా హాళ్లు తెరుచుకొని ఉంటాయో మూతపడతాయో అర్థం కాని పరిస్థితి.


అయితే ఈ క్రమంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ థియేటర్లు మూసివేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన  మార్గదర్శకాలను థియేటర్ల యాజమాన్యం తూచా తప్పకుండా పాటిస్తే.. యధావిధిగా థియేటర్లు నడుపుకోవచ్చు అని ఆయన అన్నారు.


దీంతో వకీల్ సాబ్ మూవీ రిలీజ్ డేట్ కి ఎటువంటి భంగం కలగడం లేదని తెలుస్తోంది. కేవలం రెండు వారాల సమయంలో వకీల్ సాబ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి శుభవార్త అందించారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మ్యూజిక్ ఫెస్ట్, ఇంటర్వ్యూస్‌తో సినిమాపై ఆసక్తి పెంచే దిశగా చిత్రబృందం ముందడుగు వేస్తోంది.


ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

ఆ అనుష్క హోర్డింగ్ వల్ల ఇంత దారుణం జరిగిందా..!!

అన్న వద్దు.. తమ్ముడు కావాలన్న రష్మిక..

నాగార్జున సాగర్ ఎన్నిక అవ్వగానే... చుక్కలే ఇక

మోడీతో వైసీపీ తొలిసారిగా అలా ?

తిరుపతిలో టీడీపీ బ్రహ్మాస్త్రం..ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...?

బాబు అప్పుడేమో అలా, ఇప్పుడిలా, సోము సంచలనం..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>