PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila57a8bc9f-0d82-4591-8f94-bf4d79851d98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila57a8bc9f-0d82-4591-8f94-bf4d79851d98-415x250-IndiaHerald.jpgఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వచ్చే అసెంబ్లీ పోటీ చేయనున్నట్లు వైఎస్ షర్మిల ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతే కాదు.. పాలేరు నుంచే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తున్న వై ఎస్ షర్మిల ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. వైఎస్‌కు పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలాగేనని కూడ ఆమె అన్నట్టు వార్తలు వచ్చాయి. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆమె ధీమా వ్యక్తం చేసిందట. ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో షర్మిల తమ పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించనునsharmila;jagan;y. s. rajasekhara reddy;mp;district;police;assembly;pulivendula;ycp;khammam;partyపాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?sharmila;jagan;y. s. rajasekhara reddy;mp;district;police;assembly;pulivendula;ycp;khammam;partyThu, 25 Mar 2021 07:00:00 GMTజిల్లా పాలేరు నుంచి వచ్చే అసెంబ్లీ పోటీ చేయనున్నట్లు  వైఎస్ షర్మిల ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతే కాదు.. పాలేరు నుంచే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తున్న వై ఎస్ షర్మిల ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. వైఎస్‌కు పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలాగేనని కూడ ఆమె అన్నట్టు వార్తలు వచ్చాయి.  ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆమె ధీమా వ్యక్తం చేసిందట. ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో షర్మిల తమ పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించనున్న సంగతి తెలిసిందే.

ఈమేరకు ఖమ్మం పోలీసులు అనుమతి కూడా ఇచ్చేశారు. అయితే.. ప్రస్తుతం పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెట్టామని, షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారన్నది వాస్తవం కాదని షర్మిళ అనుచరుడు కొండా రాఘవరెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం ఏప్రిల్‌లో ఖమ్మంలో నిర్వహించే సభకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు  కొండా రాఘవరెడ్డి చెప్పారు. ఖమ్మంలో నిర్వహించే సభ ఏర్పాట్ల కోసం కో ఆర్డినేటర్‌ను నియమించామని, పార్టీ పేరు , విధివిధానాలు ప్రకటించకుండా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని కొండా రాఘవరెడ్డి అన్నారు.


అయితే అసలు పాలేరు పేరు ఎందుకు బయటకు వచ్చింది. ఆ నియోజకవర్గం విశిష్టత ఏంటి.. అంటే.. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ప్రభావం ఎక్కువగా ఉన్నది ఖమ్మం జిల్లాలోనే. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటుతో పాటు 3 అసెంబ్లీ సీట్లు ఈ జిల్లాలో వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత జగన్ పూర్తిగా ఏపీకే పరిమితం కావడంతో వైసీపీ నాయకులు క్రమంగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అందుకే ఇప్పుడు షర్మిళ ఖమ్మంపై కన్నేశారు. ఈ జిల్లాలో ఉన్న జనరల్ సీట్లు ఖమ్మం, పాలేరు మాత్రమే. అందుకే షర్మిల పాలేరును ఎంచుకున్నారని భావించొచ్చు. అయితే ఇప్పుడే ఆమె పాలేరును ఎంచుకున్నారని చెప్పడం తొందరపాటే అవుతుంది. 


అందుకే ఎదగలేకపోయాం.. బిజెపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..?

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?

వంశీకి రూట్ క్లియర్ చేసిన బాబు..కొడాలి ఫార్ములా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>