MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalub51a38a9-fa48-4b7b-9582-99e665cbc34d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalub51a38a9-fa48-4b7b-9582-99e665cbc34d-415x250-IndiaHerald.jpgసినిమా తీసేట‌ప్పుడు ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌ను ఎలా ఎంట‌ర్‌టైన్ చేయాలి. ఎలా మెప్పించాలి అన్న‌దానిపైనే ఫోక‌స్ పెట్టి సినిమాను తీస్తారు. అయితే అలా తీసిన‌ప్పుడు కొన్ని త‌ప్పులు జ‌ర‌గ‌టం స‌హ‌జం. నిజానికి మ‌రీ పెద్ద త‌ప్పులు అయితే ముందుగానే గుర్తించి సినిమా నుండి ఆ స‌న్నివేశాన్ని తొలగిస్తారు. కానీ కొన్ని సార్లు గుర్తిచ‌కుండా వ‌దిలేసిన చిన్న చిన్న మిస్టేక్స్ సైతం వివాదానికి దారి తీస్తాయి. తాజాగా జాతిర‌త్నాలు సినిమాకు అలాంటి స‌మ‌స్యే వ‌చ్చిప‌డింది. జాతిర‌త్నాలు సినిమాలో ఒక సీన్ లో స‌ర్ఫరోషికీ త‌మ‌న్నా..సjathirathnalu;nag ashwin;rahul new;rahul;tamannaah bhatia;k l rahul;ram madhav;tollywood;cinema;naga aswin;bhuma akhila priya;shiv sena party;anudeep kv;shiv sena;hero;rahul sipligunj;kachiguda;research and analysis wingజాతిరత్నాలు సినిమాను బ్యాన్ చేయాలి..శివసేన డిమాండ్.!జాతిరత్నాలు సినిమాను బ్యాన్ చేయాలి..శివసేన డిమాండ్.!jathirathnalu;nag ashwin;rahul new;rahul;tamannaah bhatia;k l rahul;ram madhav;tollywood;cinema;naga aswin;bhuma akhila priya;shiv sena party;anudeep kv;shiv sena;hero;rahul sipligunj;kachiguda;research and analysis wingThu, 25 Mar 2021 17:30:55 GMTసినిమా తీసేట‌ప్పుడు ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌ను ఎలా ఎంట‌ర్‌టైన్ చేయాలి. ఎలా మెప్పించాలి అన్న‌దానిపైనే ఫోక‌స్ పెట్టి సినిమాను తీస్తారు. అయితే అలా తీసిన‌ప్పుడు కొన్ని త‌ప్పులు జ‌ర‌గ‌టం స‌హ‌జం. నిజానికి మ‌రీ పెద్ద త‌ప్పులు అయితే ముందుగానే గుర్తించి సినిమా నుండి ఆ స‌న్నివేశాన్ని తొలగిస్తారు. కానీ కొన్ని సార్లు గుర్తిచ‌కుండా వ‌దిలేసిన చిన్న చిన్న మిస్టేక్స్ సైతం వివాదానికి దారి తీస్తాయి. తాజాగా జాతిర‌త్నాలు సినిమాకు అలాంటి స‌మ‌స్యే వ‌చ్చిప‌డింది. జాతిర‌త్నాలు సినిమాలో ఒక సీన్ లో స‌ర్ఫరోషికీ త‌మ‌న్నా..సమంతా..ర‌ష్మికా థీనోసాత్ హై..అంటూ క‌విత చెప్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే వివాదానికి దారితీసింది. స్వాతంత్య్ర సమరయోధులు రాంప్రసాద్‌ బిస్మిల్‌ ఉరికంబం ఎక్కే ముందు పాడిన సర్‌ ఫరోషికీ తమన్నా హబ్‌ హమారే దిల్‌ మీ హై..క‌విత‌ను ఎట‌కారంగా పాడారంటూ శివ‌సేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమా గంగాధర్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.

ఈ సంధ‌ర్బంగా గంగాధ‌ర్ మాట్లాడుతూ...స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను అవ‌మానించేలా స‌న్నివేశం ఉండ‌టంతో సినిమా నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, క‌విత‌ను చెప్పిన గాయ‌కుడు, ర‌చ‌యిత పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమాను బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇక దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండ‌గా ఈ చిత్రానికి అనుదీప్ కేవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా నాగ్ అశ్విన్ సినిమాను నిర్మించారు. ఈ టాలీవుడ్ యంగ్ హీరో న‌వీన్ పొటిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా జంట‌గా న‌టించారు. అంతే కాకుండా సినిమాలో ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సినిమాకు మొద‌టి షోతోనే మంచి టాక్ రావ‌డంతో క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురింది. ఇప్ప‌టికీ ఈ సినిమా క‌లెక్ష‌న్‌ల ప‌రంగా దూసుకుపోతూనే ఉంది. దాంతో చిత్ర యూనిట్ సినిమా స‌క్సెన్ భాగా ఎంజాయ్ చేస్తోంది.


నాగ శౌర్య 'లక్ష ' నికి చేరువలో ఉన్నారు

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>