PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-second-wave-allert-in-andhra-pradeshe963967a-8097-47c9-8aa5-90ff66340a0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-second-wave-allert-in-andhra-pradeshe963967a-8097-47c9-8aa5-90ff66340a0e-415x250-IndiaHerald.jpgకరోనా వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ ఆస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చి... కొన్ని వార్డులను ప్రత్యేకంగా కొవిడ్ పేషెంట్లకు కేటాయించేవారు. గతేడాది జులై, ఆగస్ట్‌ నెలల్లో వైరస్‌ తీవ్రతను బట్టి ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి సుమారు 208 ఆస్పత్రుల్లో కోవిడ్‌ సేవలు అందించారు. వైరస్ ఉధృతి తగ్గిపోతున్న సమయంలో ఆస్పత్రుల సంఖ్యను తగ్గించారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను కూడా కుదించారు. ప్రస్తుతం ఏపీలో కేవలం 51 ఆస్పత్రుల్లో మాత్రమే కొవిడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 5074 బెడ్లు కేవలం కొవిడ్ పేషెంట్లకు కేటాయింcorona second wave, corona hospitals, covid allert;march;lieసెకండ్ వేవ్ అలెర్ట్.. ఏపీలో పెరుగుతున్న కొవిడ్ ఆస్పత్రుల సంఖ్య..సెకండ్ వేవ్ అలెర్ట్.. ఏపీలో పెరుగుతున్న కొవిడ్ ఆస్పత్రుల సంఖ్య..corona second wave, corona hospitals, covid allert;march;lieThu, 25 Mar 2021 09:00:00 GMT
కరోనా సెకండ్‌ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24గంటల్లో కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, అవసరాలను బట్టి ఆస్పత్రుల సంఖ్యను పెంచడానికి కసరత్తు మొదలు పెట్టింది. రోజువారీ వస్తున్న పాజిటివ్‌ కేసులు, యాక్టివ్‌ కేసులను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా కోవిడ్‌ సేవలను అందించేలా ఆస్పత్రులను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఏపీలోని 51 ఆస్పత్రుల్లో కోవిడ్‌ సేవలు అందిస్తున్నారు. వీటిల్లో 5,074 పడకలు అందుబాటులో ఉన్నాయి. 2,616 యాక్టివ్‌ కేసులు ఉండగా మిగతావి మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అయితే రోజువారీ కేసుల సంఖ్య పెరగడంతో ఖాళీగా ఉన్న బెడ్లు వారికి సరిపోవనే అనుమానం కూడా ఉంది.

ప్రస్తుతం కొవిడ్ కేసులు ఎక్కువవుతున్నా.. ఎవరూ ఆస్పత్రి వరకు రావడంలేదు. ఎక్కువమంది హోం ఐసోలేషన్‌ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కేవలం 42 మందే ఆస్పత్రుల్లో చేరారు. అయితే కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రులను సమాయత్తం చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 243 ఆస్పత్రులను గుర్తించారు. 17,341 పడకలు సిద్ధం చేస్తున్నారు. 3,181 వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఎక్కువమంది హోం ఐసోలేషన్లోనే ఉండి చికిత్స తీసుకోవడంతో ఆస్పత్రులపై భారం ఇంకా పడలేదు. కానీ కేసులు మరింత పెరిగితే ఇబ్బంది ఎదురవుతుందని, ముందు జాగ్రత్తగా ఆస్పత్రులను, బెడ్స్ ని సిద్ధం చేస్తున్నారు అధికారులు.




అశ్వగంధ చూర్ణం తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో .. మీకు తెలుసా...?

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?

ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>