CrimeN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/for-the-hairstyle-the-boy-who-poured-kerosene-on-his-head-and-set-it-on-fire-finallyc1df7679-d376-49e1-85ae-a45ffd939fca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/for-the-hairstyle-the-boy-who-poured-kerosene-on-his-head-and-set-it-on-fire-finallyc1df7679-d376-49e1-85ae-a45ffd939fca-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో యువత ఫ్యాషన్ కి బానిసైయ్యారు. ఇక స్టైల్ గా కనిపించడం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. ఇక పిల్లలపై సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంది. తమ అభిమాన హీరోను అనుకరించడం, సోషల్ మీడియాలో వైరల్ వీడియోలను ఫాలో కావడం.. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలా అనుకరించే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రాణాలను కోల్పోతున్నారు.hairstyle;tiru;police;media;fire;local language;fashion;thiruvananthapuramహెయిర్ స్టైల్ కోసం.. తలపై కిరోసిన్ పోసుకొని తగులబెట్టుకున్న బాలుడు.. చివరకి..!హెయిర్ స్టైల్ కోసం.. తలపై కిరోసిన్ పోసుకొని తగులబెట్టుకున్న బాలుడు.. చివరకి..!hairstyle;tiru;police;media;fire;local language;fashion;thiruvananthapuramThu, 25 Mar 2021 09:00:00 GMTఫ్యాషన్ కి బానిసైయ్యారు. ఇక స్టైల్ గా కనిపించడం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. ఇక పిల్లలపై సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంది. తమ అభిమాన హీరోను అనుకరించడం, సోషల్ మీడియాలో వైరల్ వీడియోలను ఫాలో కావడం.. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలా అనుకరించే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రాణాలను కోల్పోతున్నారు. కేరళలో ఇలాంటి దారుణమే జరిగింది. అయితే యూబ్యూబ్‌లో చూసి ఓ బాలుడు తన జుట్టుపై ప్రయోగం చేశాడు. కొత్త హెయిర్ స్టైల్ కోసం తలపై కిరోసిన్ పోసుకొని తగులబెట్టుకున్నాడు. అనంతరం తీవ్ర గాయాలతో మరణించాడు. తిరువనంతపురంలో ఈ దారుణం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని వెంగనూర్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల శివనారాయణన్ ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇతడు సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతాడు. లేటెస్ట్ ట్రెండ్స్‌కు తగ్గట్టు స్టైల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో శివనారయణన్ ఇటీవల యూట్యూబ్‌లో ఓ సరికొత్త హెయిర్ స్టైల్ వీడియో చూశాడు. అందులో తలపై మంటపెట్టి హెయిర్ స్ట్రెయిట్‌నింగ్ చేశారు. ఆ వీడియో అతడికి తెగ నచ్చింది. వెంటనే తాను అలాగే చేయాలనుకున్నాడు. బాత్రూమ్‌కు వెళ్లి.. తలపై కిరోసిన్ పోసుకొని నిప్పుపెట్టుకున్నాడు. ప్రయోగం బెడిసికొట్టి తలపై పెద్ద మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలతో విలవిల్లాడిపోయాడు.

ఇక ఆ సమయంలో ఇంట్లో అతడి నానమ్మ మాత్రమే ఉంది. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల ప్రజలు వచ్చి మంటలను ఆర్పివేశారు. తీవ్ర గాయాల పాలైన శివనారాయణన్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. శివనారాయణన్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరూ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని పోలీసులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.


అశ్వగంధ చూర్ణం తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో .. మీకు తెలుసా...?

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?

ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>