Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/tape-wormf458edd2-068a-42e5-af7b-995423189069-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/tape-wormf458edd2-068a-42e5-af7b-995423189069-415x250-IndiaHerald.jpgకొందరి కడుపులోనుంచి డాక్టర్లు అనేక విచిత్రమైన వస్తువులు బయటకు తీసిన ఘటనలు ఇప్పటికే మనకు చాలా తెలుసు. ముఖ్యంగా చైనా తదితర ఆసియా దేశాల్లో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కొందరి కడుపులో నుంచి ఇనుప వస్తువులు బయటకు తీస్తే....tape worm;local language;paruguకడుపులో 59 అడుగుల టేప్ వర్మ్.. బయటకు తీసి డాక్టర్లే షాక్కడుపులో 59 అడుగుల టేప్ వర్మ్.. బయటకు తీసి డాక్టర్లే షాక్tape worm;local language;paruguThu, 25 Mar 2021 22:12:00 GMTఇంటర్నెట్ డెస్క్: కొందరి కడుపులోనుంచి డాక్టర్లు అనేక విచిత్రమైన వస్తువులు బయటకు తీసిన ఘటనలు ఇప్పటికే మనకు చాలా తెలుసు. ముఖ్యంగా చైనా తదితర ఆసియా దేశాల్లో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కొందరి కడుపులో నుంచి ఇనుప వస్తువులు బయటకు తీస్తే.. మరికొందరి కడుపులో నుంచి వెంట్రుకల గుత్తులను బయటకు తీశారు. కాగా.. తాజాగా  ఇంతకంటే దారుణమైన ఘటన థాయ్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది.

ఓ వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్లు ఓ టేప్ వర్మ్‌ను వెలికి తీశారు. దీనిని చూసిన డాక్టర్లకు దిమ్మతిరిగినంతపనైంది. ఎందుకంటే  అది ఏదో ఓ అడుగు, రెండడుగులు కాదు.. ఏకంగా 59 అడుగుల పొడవుంది. షాకయ్యారా..? వినడానికే ఇలా ఉంటే ఇక దానిని బయటకు తీసిన డాక్టర్ల పరిస్థితి ఏంటి..? ఇన్నేళ్లుగా దానిని తన కడుపులో భరించిన ఆ వ్యక్తి దుస్థితి ఏంటి..?.

 దీని గురించి డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక నాంగ్ ఖాయ్ ప్రావిన్స్‌లోని ఓ ఆసుపత్రికి ఓ 67 ఏళ్ల వృద్ధుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అలాగే ఆపానవాయువు(ఫార్టింగ్) సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. అయితే చాలా కాలంగా ఈ సమస్య ఉన్నా.. అతడు పట్టించుకోలేదు. కానీ.. ఇటీవల కడుపులో బాధ ఎక్కువ కావడంతో ఎట్టకేలకు ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు అతడి పరిస్థితి తెలుసుకుని పరీక్షలకు పంపించారు.

అతడి మలాన్ని సేకరించి వేరే ప్రావిన్స్‌లో ఉన్న ఓ ల్యాబొరేటరీకి పరీక్షల కోసం పంపించారు. ఆ పరీక్షల్లో అతడు టేప్ వర్మ్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతడి మలంలో దాదాపు 28 గుడ్లను సైతం గుర్తించారు. దీంతో డాక్టర్లు అతడికి నులిపురుగులను నశింపజేసే ఔషధాలను వాడారు. ఈ క్రమంలోనే అతడి మలద్వారం నుంచి ఈ టేప్ వర్మ్ బయటకొచ్చింది.

మొదట ఏదో చిన్నదిగా ఉంటుందని డాక్టర్లు భావించారు. అయితే లాగే కొద్దీ అంతం లేకుండా బయటకు వస్తోంది. దీంతో డాక్టర్లంతా షాకయ్యారు. చివరకు 18 మీటర్లు(59 అడుగులు) పొడవున్న టేప్ వర్మ్‌ను అతడి మలద్వారం నుంచి బయటకు లాగారు.

బయటకు తీసిన తరువాత ఆ పరుగును ఓ ఎర్రటి వస్త్రంపై పరిచి మరీ డాక్టర్లు డిస్‌ప్లే చేశారు. దీనిపై ఆసుపత్రిలోని పారాసైటిక్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది మాట్లాడుతూ.. ఇంత పెద్ద పురుగు ఉంటుందని అనుకోలేదని, ముక్కలుముక్కులుగా ఆ పురుగును బయటకు తీశామని, మొత్తం తీసిన తర్వాత దాని పొడవును కొలిస్తే ఏకంగా 59 అడుగులున్నట్లు గుర్తించామని తెలిపారు.

ఇంత పెద్ద పురుగును బయటకు తీయడంతో సదరు పేషెంట్ ఆశ్చర్యం వక్తం చేశాడు. తాను ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నానని అనుకోలేదని, ముందుగా ఆసుపత్రికి వచ్చి ఉండాల్సిందని అన్నాడు. అయితే ఇప్పటికైనా డాక్టర్లు తనకు ఈ సమస్య నుంచి విముక్తి కలిగించినందుకు ధన్యవాదాలని చెప్పాడు.




విజయం మీదే: కెరీర్ లో ఈ సలహాలు పాటించండి...?

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>