PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgసాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ పంట పొలాలకు నిరంతరం సాగునీరు ప్రవహిస్తున్నందున, సాగునీటి వ్యవస్థలను పటిష్టపరుచుకోవాలని... ఇందుకు ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అమలు మరియు నిర్వహణ ) వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. పాలమూరు కల్వకుర్తి జూరాల అనుసంధానం, నిర్మాణాలు విస్తరణ మీద మూడో రోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ లో సాగునీటి రంగానికkcr,trs,ts;kcr;amala akkineni;telangana;aquaఆంధ్రాపై కేసీఆర్ పరోక్ష విమర్శఆంధ్రాపై కేసీఆర్ పరోక్ష విమర్శkcr,trs,ts;kcr;amala akkineni;telangana;aquaThu, 25 Mar 2021 10:10:00 GMTతెలంగాణ పంట పొలాలకు  నిరంతరం సాగునీరు ప్రవహిస్తున్నందున, సాగునీటి వ్యవస్థలను పటిష్టపరుచుకోవాలని... ఇందుకు ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అమలు మరియు నిర్వహణ ) వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. పాలమూరు కల్వకుర్తి  జూరాల  అనుసంధానం, నిర్మాణాలు విస్తరణ మీద మూడో రోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ లో సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత పెరిగిందని ఆయన అన్నారు. బ్యారేజీల నుంచి మొదలుకుని చివరి డిస్ట్రిబ్యూటరీ కనాల్ దాకా,  నదుల నుంచి చివరి ఆయకట్టు దాకా నీటిని తీసుకెల్లే అన్ని వ్యవస్థలను పటిష్ట పరుచుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కాల్వలు, పంపులు, బ్యారేజీల గేట్లు, రిజర్వాయర్లు  తదితర అన్నిరకాల నిర్మాణాలను వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూండాలని సూచించారు. ఉత్పన్నమయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటూ  నీటిపారుదలను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేసారు.

మరమత్తుల కోసం రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇరిగేషన్ శాఖను నీటిపారుదల తో పాటు, నీటిపారుదల రంగ నిర్వహణ శాఖగా పటిష్టంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. సాగునీరు తాగునీరు నీరేదైనా కానీ ఇరిగేషన్ శాఖ నీటి పారుదలకు మారుపేరుగా మారింది అని, నేడు తెలంగాణకు నీటిపారుదల శాఖ  లైఫ్ లైన్ గా మారింది అని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో  సాగునీటి ప్రాజెక్టులు కాల్వలు వ్యవహారం అంతా ఆంధ్రా రాష్ట్ర వ్యవహారం అన్నట్టుగా సాగింది అని... కానీ నేడు తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారింది అన్నారు.  ఈ యాసంగిలోనే తెలంగాణ 52 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తూ, వరిపంటలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది అని వెల్లడించారు.  మనకు పంటలే పండవు అని మనలను తక్కువ చేసి చూసిన పక్క రాష్ట్రం ఇవ్వాళ మూడోస్థానంలో వున్నది అని అన్నారు. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ సాగునీటి రంగం ఎంత వైబ్రంట్ గా వున్నదో అని ఆయన పేర్కొన్నారు.


ఎండలు ముదురుతున్నాయి.. మజ్జిగతో ఎంత మేలో తెలుసా..?

తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

జగన్ మరో బ్లండర్ చేస్తున్నారా..? శ్యామ్యూల్‌కి ఎస్‌ఈసీ ఎలా..?

తిరుపతిలో పవన్ అడుగుపెట్టే ఛాన్స్ లేనట్టే...?

ప‌వ‌న్ మంచి ప‌నిచేశాడు... జ‌న‌సేన ఫుల్ ఖుషీ...!

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>