Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/india-and-pakistan-cricket-tournament-might-start-very-soon54e5869b-2330-45e8-a6f6-bfe1f7de71af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/india-and-pakistan-cricket-tournament-might-start-very-soon54e5869b-2330-45e8-a6f6-bfe1f7de71af-415x250-IndiaHerald.jpgభారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో వేరే చెప్పక్కర్లేదు. ప్రేక్షకులే కాదు.. మైదానంలో ఆటగాళ్ల మధ్య కూడా చాలా ఇంటెన్సివ్ బ్యాటిల్ జరుగుతుంది. ఇంకా మాట్లాడితే ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌ ఓ ఆటలా కాకుండా చిన్న సైజు యుద్ధంలా..cricket;cricket;india;pakistan;2019;media;war;letter;icc t20మళ్లీ తెరపైకి భారత్-పాక్ క్రికెట్.. త్వరలో ఓ టోర్నీ!మళ్లీ తెరపైకి భారత్-పాక్ క్రికెట్.. త్వరలో ఓ టోర్నీ!cricket;cricket;india;pakistan;2019;media;war;letter;icc t20Thu, 25 Mar 2021 21:21:20 GMTఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో వేరే చెప్పక్కర్లేదు. ప్రేక్షకులే కాదు.. మైదానంలో ఆటగాళ్ల మధ్య కూడా చాలా ఇంటెన్సివ్ బ్యాటిల్ జరుగుతుంది. ఇంకా మాట్లాడితే ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌ ఓ ఆటలా కాకుండా చిన్న సైజు యుద్ధంలా సాగుంతుంది. కానీ దాదాపు 8 ఏళ్లుగా ఇరుజట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు.

అయితే మళ్లీ ఈ రెండు జట్లు మైదానంలో తలపడే రోజు అతి చేరువలో ఉందని పాక్‌లోని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. త్వరలో ఈ రెండు జట్ల మధ్య ఓ ద్వైపాక్షిక టోర్నీ నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు చర్చలు జరుపుతున్నాయని, పాక్ ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయా వార్తా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి.

‘పాకిస్తాన్ జట్టు భారత్‌లో త్వరలో పర్యటించబోతోంది. అది కూడా ఏకంగా ఈ ఏడాదిలోనే ఆ పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌-పాక్ మధ్య టీ20 ద్వైపాక్షిక సిరీస్‌ జరగనుంది. దీనికి ప్రేక్షకులంతా సన్నద్ధంగా ఉండాలి. ఈ విషయంపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి’ అంటూ పాక్ మీడియా ఇటీవల తెగ ఊదరగొట్టేస్తోంది. అయితే దీనిపై అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

ఇదిలా ఉంటే కొంత కాలంగా భారత్ పాక్ మద్య ద్వేపాక్షిక సంబంధాలు దెబ్బ తినడంతో ఇరుజట్ల మధ్య ఎలాంటి క్రికెట్ టోర్నీలు లేకుండా పోయాయి. 2012-13 తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ కూడా జరగలేదు. అయితే ఐసీసీ టోర్నమెంట్‌లలో మాత్రం అడపాదడపా ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. చివరిగా 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాక్‌తో తలపడిన టీమిండియా ఘన విజయం సాధించింది.

ఇక త్వరలో భారత్‌ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ టోర్నీ కోసం పాకిస్తాన్ బీసీసీఐకి కొన్ని షరతులు కూడా విధిస్తూ ఐసీసీకి లేఖ రాసింది. ఒకవేళ పాక్ మీడియా కథనం నిజమే అయితే ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. దాయిది పోరు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కల నెరవేరినట్లేనని చెప్పాలి.




ఆటోలో తమిళ్ నటుడు మృతి. దిగ్బ్రాంతిలో తమిళ్ ఇండస్ట్రీ.....

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>