Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england-former-praised-dravid-for-prasidh-krishna-4-wicket-in-1st-one-day7352e64b-7540-4658-9c8d-d135df458a90-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england-former-praised-dravid-for-prasidh-krishna-4-wicket-in-1st-one-day7352e64b-7540-4658-9c8d-d135df458a90-415x250-IndiaHerald.jpgఇంగ్లండ్ జట్టు భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి టీమిండియాపై, బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీలు అనేకమంది అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. వారిలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ కూడా ఉన్నాడు. తాజాగా వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా విజయం సాధించడంపై అతడు మళ్లీ నోరు విప్పాడు. అయితే ఈ సారి తొలిసారిగా టీమిండియా ఆటగాళ్లను..rahul dravid;krishna;laya;rahul new;rahul;rani;varsha;virat kohli;k l rahul;karnataka - bengaluru;bcci;interview;rahul sipligunj;success;yuva;international;ravi shastri;tom banton;tom hooper;ben stokes;parugu‘ఆ సక్సెస్ క్రెడిట్ అంతా ద్రవిడ్‌దే.. ఫస్ట్ టైం పొగిడిన ఇంగ్లండ్ మాజీ’‘ఆ సక్సెస్ క్రెడిట్ అంతా ద్రవిడ్‌దే.. ఫస్ట్ టైం పొగిడిన ఇంగ్లండ్ మాజీ’rahul dravid;krishna;laya;rahul new;rahul;rani;varsha;virat kohli;k l rahul;karnataka - bengaluru;bcci;interview;rahul sipligunj;success;yuva;international;ravi shastri;tom banton;tom hooper;ben stokes;paruguThu, 25 Mar 2021 08:05:11 GMTఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ జట్టు భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి టీమిండియాపై, బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీలు అనేకమంది అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. వారిలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ కూడా ఉన్నాడు. తాజాగా వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా విజయం సాధించడంపై అతడు మళ్లీ నోరు విప్పాడు. అయితే ఈ సారి తొలిసారిగా టీమిండియా ఆటగాళ్లను ప్రశంసించాడు. ప్రధానంగా అరంగేట్ర ఆటగాడైన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను అభినందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వాన్ ప్రసిద్ధ కృష్ణపై, టీమిండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

తొలి వన్డేలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ దాడిని ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా నిలువరించాడని, చేజారుతున్న మ్యాచ్‌ను తిరిగి భారత్‌ వైపు మరల్చాడని వాన్ కితాబిచ్చాడు. అయితే ఈ ఘనత యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న రాహుల్ ద్రవిడ్‌కే దక్కుతుందని వాన్ అన్నాడు. ‘తొలి మ్యాచ్‌ అయినా ఎలాంటి తడబాటు లేకుండా ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌పై ప్రసిద్ధ్ పైచేయి సాధించాడు. అయితే ఈ గొప్పతనం యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ కృషి వల్లనే సాధ్యమవుతోంది. యువ ఆటగాళ్లను అతడు మలుస్తున్న తీరు అద్భుతం. బీసీసీఐ అనుసరిస్తున్న పద్ధతులు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నాడు.

అంతేకాకుండా యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడడానికి ఐపీఎల్‌ కారణమని అంటూ ఉంటామని, కానీ నిజానికి ఏ- జట్టును అభివృద్ధి చేయడంలో రాహుల్‌ ద్రవిడ్‌ పాత్ర అనిర్వచనీయం అని అభినందించాడు. ఆటగాళ్లలో ప్రతిభతో పాటు పట్టుదల, సమయస్ఫూర్తిని పెంపొందించి వారిని మెరికల్లా తీర్చిదిద్దుతున్నాడని, దానివల్లే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా వారు రాణించగలుగుతున్నారని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి సైతం డ్రెస్సింగ్‌ రూంలో కొత్త ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడీ లేకుండా చూసుకుంటున్నారని, అది యువ ఆటగాళ్లకు మరింత ఉత్సాహాన్నిస్తోందని, మ్యాచ్‌లో గొప్పగా రాణించేందుకు దోహదపడుతోందని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కర్ణాటక పేసర్ ప్రసిద్ద్‌ కృష్ణ.. తొలి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. ప్రారంభంలో ధారాళంగా పరుగులిచ్చినా, ఆ తర్వాత లయ దొరకబుచ్చుకుని కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్ జేసన్ రాయ్‌‌ను తన తొలి వికెట్‌‌గా ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 8.1 ఓవర్లు విసిరిన ప్రసిద్ధ్ కృష్ణ 54 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రాయ్‌తో పాటు బెన్ స్టోక్స్, శామ్ బిల్లింగ్స్, టామ్ కర్రాన్ వికెట్లు దక్కించుకున్నాడు.


ప‌వ‌న్ మంచి ప‌నిచేశాడు... జ‌న‌సేన ఫుల్ ఖుషీ...!

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?

ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>