PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడు కాస్త ఎక్కువగా టార్గెట్ చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో ఆయన గతంలో కంటే కూడా చాలావరకు జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా నడిపించారు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజjagan,ycp,ap;bhavana;jagan;andhra pradesh;chief minister;cow slaughterఈ నిర్ణయంతో గ్రామాలకు జగన్ మరింత దగ్గరవుతారా...?ఈ నిర్ణయంతో గ్రామాలకు జగన్ మరింత దగ్గరవుతారా...?jagan,ycp,ap;bhavana;jagan;andhra pradesh;chief minister;cow slaughterThu, 25 Mar 2021 18:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడు కాస్త ఎక్కువగా టార్గెట్ చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో ఆయన గతంలో కంటే కూడా చాలావరకు జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా నడిపించారు.

ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆకట్టుకోవడానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలను కూడా అందించడానికి కొన్ని సర్వీసులను కూడా ఆయన ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు వాలంటీర్ ల వ్యవస్థ కూడా ఇప్పుడు గ్రామాల్లో కాస్త బలంగానే ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు పశువుల కోసం అంబులెన్సులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

175 నియోజకవర్గాలకు గాను 175 అంబులెన్స్లను సిద్ధం చేసి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు సంవర్ధక శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. 6099 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు కూడా ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో పాడి రైతులకు ఈ అంబులెన్స్లో ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా గొర్రెలు, ఆవులు వంటి వాటికి ఉచితంగా వైద్యం చేయడానికి వీటిని వినియోగించే అవకాశాలు కనబడుతున్నాయి. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మరింతగా దగ్గర కావచ్చు అని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తి కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో 108 సర్వీసులు 104 సర్వీసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ముందుకు తీసుకెళుతోంది.


సినిమా లెంగ్త్ కోసం ఆమె సీన్స్ తిసేస్తున్న రాజమౌళి ...

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>